Vijay Devarakonda Traditional Look: ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా తన కెరియర్ ను మొదలుపెట్టిన నటుడు విజయ్ దేవరకొండ…అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు…గత కొద్దిరోజుల నుంచి ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాపులుగా మారుతున్నాయి. గత సంవత్సరం చేసిన కింగ్ డమ్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక రీసెంట్ గా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆయన తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించాడు. కోర మీసాలతో ట్రెడిషనల్ డ్రెస్ లో ప్రతి ఒక్కరిని అలరించిన ఆయన డివోషనల్ మూమెంట్స్ ని సైతం ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా విజయ్ దేవరకొండ నుంచి వచ్చే సినిమాకి చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది.
ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకోబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది. అటు సినిమాలతో తన సత్తా చాటుతూనే పండగల సమయంలో ట్రెడిషనల్ లుక్ లో సైతం తన అభిమానులను అలరిస్తున్నాడు అంటూ విజయ్ దేవరకొండ మీద తన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ లుక్కు నీకు పర్ఫెక్ట్ గా సెట్ అయిందన్న అంటూ అతను అభిమానులు విజయ్ ని చూసి గర్వఆడుతుండటం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన రవికిరణ్ కోలా డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులందరిని మెప్పించింది. ఈ సినిమాతో ఆయన ఎలాంటి ఇమేజ్ ను మూట గట్టుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా చాలా బోల్ట్ కంటెంట్ తో తెరకెక్కుతోంది.
ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది తద్వారా తనకంటూ ఒక ఐడెంటిటిని తీసుకొచ్చి పెడుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం టైర్ వన్ హీరోగా మారాలంటే వరుసగా రెండు మూడు భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది…