BCCI 538 Crore Court Verdict: ఐసీసీ సంపాదిస్తున్న సంపాదనలో సగభాగం మొత్తం భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచే వెళ్తోంది.. అందువల్లే భారత క్రికెట్ నియంత్రణ మండలి పెత్తనం అంతర్జాతీయ క్రికెట్ మండలి లో కొనసాగుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ మండలికి అధ్యక్షుడిగా జై షా కొనసాగుతున్నారు. ఒక రకంగా భారత్ కు అనుకూలంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి తీసుకునే నిర్ణయాల వెనుక జై షా ఉన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవల కాలంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అంతర్జాతీయ క్రికెట్ మండలి భారతదేశానికి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శనను నిలువరించింది.. అంతే కాదు తటస్థ వేదికల మీదే భారత్ మ్యాచులు ఆడేలా షెడ్యూల్ రూపకల్పన చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే భారత క్రికెట్ నియంత్రణ మండలికి అంతర్జాతీయ క్రికెట్ మండలి లో ఎదురు అనేది లేదు. పోటీ అనేది కూడా లేదు. అంతటి ఆంగ్ల, కంగారు దేశాల మేనేజ్మెంట్ సైతం భారత్ తీసుకున్న నిర్ణయాలకు తల ఊపాల్సిందే. ప్రపంచం మొత్తం భారత క్రికెట్ నియంత్రణ మండలి ముందు సలాం కొడుతుంటే.. బాంబే హైకోర్టు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది.
2011లో తప్పుకుంది..
2011లో కొచ్చి టస్కర్స్ ఐపీఎల్ నుంచి తప్పుకుంది. వాస్తవానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకొని నిర్ణయం వల్ల కొచ్చి జట్టు తప్పుకోవలసి వచ్చింది. బ్యాంకు గ్యారంటీ చెల్లించలేదనే కారణంతోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొచ్చి మేనేజ్మెంట్ ముంబై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2011లో నమోదైన కేసు ఇన్నాళ్లపాటు విచారణ సాగింది. చివరికి ముంబై సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. ఆ తీర్పు ప్రకారం వచ్చి యాజమాన్యానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఏకంగా 538 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు గ్యారంటీ చెల్లించలేదు అనే కారణాలు చూపి జట్టును ఐపీఎల్ నుంచి తొలగించడం సరికాదని ముంబై హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నగదును తక్షణమే చెల్లించాలని.. ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: BCCI : బీసీసీఐ కొత్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఇదే ?
కచ్చితంగా చెల్లించాల్సిందే..
ముంబై కోర్టు ఇచ్చిన తీర్పు ఒక్కసారిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రజలకు మింగుడు పడని వ్యవహారం లాగా మారిపోయింది. వాస్తవానికి బ్యాంకు గ్యారంటీ అనేది కచ్చితంగా ఉండాలని.. ఆ నిబంధన ఆధారంగానే ఐపీఎల్ లో జట్లకు అవకాశం కల్పిస్తున్నామని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. ఆయనప్పటికీ కోర్టు ఆ వాదనలతో ఏకీభవించలేదు. ఇలాంటి వ్యవహారం సరికాదని కోర్టు మండిపడింది. అంతేకాదు తక్షణమే కొచ్చి జట్టు యాజమాన్యానికి డబ్బులు చెల్లించాలని సూచించింది. అయితే ఈ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు భావిస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది? ఎలాంటి తీర్పు ఇస్తుంది? అనేది చూడాల్సి ఉందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.