US Presidential Election 2024: బైడెన్‌ను భరించాల్సిందేనా.. ఒబామాతో రీప్లేస్‌ చేయడం సాధ్యం కాదా..?

అమెరికా రాజ్యంగంలోని 22వ సవరణ కారణంగా బారాక్‌ ఒబామా మళ్లీ అధ్యక్ష పదవికి డెమోక్రటిక్‌ అభ్యర్థి కాలేదు. 1951లో ఆమోదించబడిన ఈ సవరణ ప్రకారం ఏ వ్యక్తి కూడా రెండుసార్ల కంటే ఎక్కువసార్లు అధ్యక్ష పదవికి ఎన్నిక కాకూడదు. ఒబామా 2009 నుంyచి 2017 వరకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు. అతను మళ్లీ అధ్యక్షుడిగా పోటీ చేయడానికి లేదా ఎన్నుకోబడటానికి రాజ్యాంగపరంగా అనర్హుడు.

Written By: Raj Shekar, Updated On : July 13, 2024 11:29 am

US Presidential Election 2024

Follow us on

US Presidential Election 2024: అగ్రరాజ్యం గతంలో ఎన్నడూ లేనివిధంగా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థుల సంక్షోభం ఎదుర్కొటోంది. ప్రస్తుతం అధికార డెమోక్రటిక్‌ అభ్యర్థిగా జోబైడెన్‌ బరిలో ఉన్నారు. ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ చేస్తున్నారు. అమెరికన్లు ఈ ఇద్దరి ఐదేళ్ల పాలన చూశారు. ఒకరు ఉదారవాది అయితే ఒకరు నియంతృత్వవాది. ఉదారవాద పార్టీ అయిన డెమొక్రటిక్‌ పార్టీపై అమెరికన్లు సానుకూలంగా ఉన్నా.. అభ్యర్థిపై తీత్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జోబైడెన్‌ వృద్ధాప్య సమస్యలో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు ఇటు డెమోక్రాట్లను, అటు అమెరిన్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బైడెన్‌ను తప్పించాలని సొంత పార్టీ నేతలే కోరుతున్నారు. ఆయన ఉంటే గెలవడం కష్టమని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. గవర్నర్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు డెమోక్రాట్లకు విరాళాలు సేకరించే వారు చెబుతున్నారు. ఈ క్రమంలో బైడెన్‌ స్థానంలో మాజీ అధ్యక్షుడు బారక్‌ ఒబామాను బరిలో దింపాలన్న డిమాండ్‌ వస్తోంది. అయితే ఒబామా మళ్లీ అధ్యక్షుడు కాలేలని అక్కడి విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఒబామా కూడా అంగీకరిస్తున్నారు.

అంగీకరించని అమెరికా రాజ్యాంగం..
అమెరికా రాజ్యంగంలోని 22వ సవరణ కారణంగా బారాక్‌ ఒబామా మళ్లీ అధ్యక్ష పదవికి డెమోక్రటిక్‌ అభ్యర్థి కాలేదు. 1951లో ఆమోదించబడిన ఈ సవరణ ప్రకారం ఏ వ్యక్తి కూడా రెండుసార్ల కంటే ఎక్కువసార్లు అధ్యక్ష పదవికి ఎన్నిక కాకూడదు. ఒబామా 2009 నుంyచి 2017 వరకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు. అతను మళ్లీ అధ్యక్షుడిగా పోటీ చేయడానికి లేదా ఎన్నుకోబడటానికి రాజ్యాంగపరంగా అనర్హుడు. నాయకత్వ భ్రమణాన్ని ప్రోత్సహించడం,ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖపై సుదీర్ఘ నియంత్రణను కొనసాగించకుండా ఏ వ్యక్తిని నిరోధించడం ద్వారా ఏ వ్యక్తి రెండు పర్యాయాలకు మించి అధ్యక్ష పదవిలో ఉండకూడదని రాజ్యాంగం సష్టం చేస్తుంది.

పార్టీ అభ్యర్థిగా కూడా ప్రకటించలేరు..
రాజ్యాంగంలోని 22, 12వ సవరణలలో పేర్కొన్న పరిమితుల కారణంగా ఒబామా జో బిడెన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కాలేరు. 22వ సవరణం ఏ వ్యక్తి కూడా రెంటు సార్లకు మించి అధ్యక్షుడు కాలేరని చెబుతోంది. ఇక 1804లో ఆమోదించిన 12వ సవరణ ప్రకారం..రాజ్యాంగబద్ధంగా అధ్యక్ష పదవికి అర్హత లేని ఏ వ్యక్తి యునైటెడ్‌ స్టేట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి అర్హులు కాదని పేర్కొంది. అంటే వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేయడానికి, ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఉండటానికి అవసరమైన అన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఈ రెండు సవరణల కలయిక వల్ల బరాక్‌ ఒబామా మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అనర్హులు. ఉపాధ్యక్షుడిగా కూడా అతను అనర్హుడని సూచిస్తుంది.

బైడెన్‌ తప్పుకుంటారా?
బైడెన్‌ శిబిరం 14 మిలియన్ల ఓట్లు, 87% మంది ఓట్లు మరియు 3,900 మంది ప్రతినిధులతో నమ్మకంగా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిగా బైడెన్‌ స్వయంగా తప్పుకుంటే తప్ప అతడిని ఎవరూ బలవంతంగా తప్పించలేరు. ఇదిలా ఉంటే బైడెన్‌ ఇటీవలి ప్రకటనలు హిల్‌ డెమోక్రాట్, జార్జ్‌ క్లూనీ వంటి హాలీవుడ్‌ ప్రముఖులు, జాన్‌ స్టీవర్ట్‌ వంటి హాస్యనటులతో సహా ప్రముఖ డెమొక్రాట్‌లను ఆందోళనకు గురిచేశాయి. తాజాగా బైడెన్‌ రష్యా అధ్యక్షుడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా బైడెన్‌ సంబోబధించారు. ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ అని పేర్కొన్నారు. గతంలో ఇటలీలో జరిగిన జీ7 దేశాల సదస్సుకు వెళ్లిన బైడెన్‌.. అ«ధ్యక్షులంతా ఒకవైపు ఉంటే.. బైడెన్‌ మరోవైపు నిలబడి తనలో తానే మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఇటలీ అధ్యక్షురాలో జార్జియా మెలోనీ అప్రమత్తమై బైడెన్‌ను చేయి పట్టుకుని తీసుకువచ్చారు. దీనిపై సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బైడెన్‌ మరోసారి అ«ధ్యక్షుడు అయితే ఎలా ఉంటుందని అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.
డిబేట్‌లోనూ విఫలం..
ఇక ఎన్నికల కోసం విరాళాలు సేకరించేందుకు అమెరికాలు నిర్వహిస్తున్న బైడెన్, ట్రంప్‌ ముఖాముఖి సభల్లోనూ బైడెన్‌ విఫలమవుతున్నారు. మొదటి సభలో బైడెన్‌ స్ట్రక్‌ అయ్యారు. ట్రంప్‌కు దీటుగా సమాధానం చెప్పడంలో వెనుకబడ్డారు. దీనిపై విమర్శలు రావడంతో స్పందించిన బైడెన్‌ అందుకు కాణాలు చెప్పుకున్నారు.

యువ నాయకత్వంపై ఫోకస్‌..
బైడెన్‌ కారణంగా డెమోక్రటిక్‌ పార్టీ పస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో యువ ఆయకత్వంపై పార్టీ ప్రతినిధులు ఫోకష పెట్టారు. పార్టీకి పూర్వవైభవం రావాలంటే యువ నాయకత్వం అవసరమని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో డెమోక్రటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో యువ వారసుడిని నామినేట్‌ చేయడానికి ‘బ్లిట్జ్‌ ప్రైమరీ‘ ప్రతిపాదించబడింది. ఇందులో కమలా హారిస్, గవర్నర్లు గ్రెట్చెన్‌ విట్మర్, గావిన్‌ న్యూసోమ్, ఆండీ బెషీర్, సెనేటర్‌ రాఫెల్‌ వార్నాక్‌ మరియు క్యాబినెట్‌ సభ్యులు గినా రైమోండో, పీట్‌ బుట్టిగీగ్‌ ఉన్నారు.

కమలా హారిస్‌
కమలా హారిస్‌ ఎన్నికైతే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా, తొలి భారతీయ సంతతికి చెందిన అధ్యక్షురాలిగా, రెండో ఆఫ్రికన్‌–అమెరికన్‌ అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించనున్నారు. 1964, అక్టోబర్‌ 20న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జన్మించిన ఆమె మొదటి మహిళా వైస్‌ ప్రెసిడెంట్‌గా అమెరికా చరిత్రలో అత్యున్నత స్థాయి మహిళా అధికారి, మొదటి ఆఫ్రికన్, అమెరికన్, మొదటి ఆసియా అమెరికన్‌గా ఉన్నారు.

గ్రెట్చెన్‌∙విట్మెర్‌
మిచిగాన్‌లోని లాన్సింగ్‌లో 1971, ఆగస్టు 23న జన్మించిన గ్రెట్చెన్‌ విట్మర్‌ 2019 జనవరి 1 నుంచి మిచిగాన్‌కు 49వ గవర్నర్‌గా పనిచేశారు. ఆమె గతంలో మిచిగాన్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో 2001 నుంచి 2006 వరకు మరియు మిచిగాన్‌∙సెనేట్‌లో 2006 నుంచి 2006 వరకు పనిచేశారు. 2015, ఆమె సెనేట్‌ మైనారిటీ నాయకురాలు.

గావిన్‌ న్యూసోమ్‌
కాలిఫోర్నియా 40వ గవర్నర్‌గా 2019 జనవరి 7న నియమితులైన గావిన్‌ న్యూసోమ్‌ గతంలో కాలిఫోర్నియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా, శాన్‌ ఫ్రాన్సిస్కో మేయర్‌గా పనిచేశారు. అతను శాంటా క్లారా విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో పట్టభద్రుడయ్యాడు. ప్లంప్‌జాక్‌ వైన్‌ స్టోర్‌ను స్థాపించాడు, ఇది విజయవంతమైన సంస్థగా విస్తరించింది.

ఆండీ బెషీర్‌
ఆండీ బెషీర్‌ 1977, నవంబర్‌ 29 కెంటుకీలోని లూయిస్‌విల్లేలో జన్మించారు, 2019, డిసెంబర్‌ 10 నుంచి కెంటుకీకి 63వ గవర్నర్‌గా ఉన్నారు. అతను వాండర్‌బిల్ట్‌ విశ్వవిద్యాలయం నుంచి తన బ్యాచిలర్‌ డిగ్రీని, యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి జూరిస్‌ డాక్టర్‌ను పొందాడు. 2016 నుండి 2019 వరకు కెంటుకీ అటార్నీ జనరల్‌గా పనిచేశారు.

రాఫెల్‌ వార్నాక్‌
జార్జియాలోని సవన్నాలో 1969చ జూలై 23న జన్మించిన రాఫెల్‌ వార్నాక్, 2021, జనవరి 20 నుంచి జార్జియా నుంచి జూనియర్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ సెనేటర్‌గా పనిచేశారు. అతను మోర్‌హౌస్‌ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. మాస్టర్‌ ఆఫ్‌ డివినిటీ, మాస్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ మరియు డాక్టర్‌ ఆఫ్‌ సంపాదించాడు. యూనియన్‌ థియోలాజికల్‌ సెమినరీ నుంచి తత్వశాస్త్రం, అట్లాంటా యొక్క చారిత్రాత్మక ఎబెనెజర్‌ బాప్టిస్ట్‌ చర్చి యొక్క సీనియర్‌ పాస్టర్‌.

గినా రైమోండో
1971, మే 17న రోడ్‌ ఐలాండ్‌లోని స్మిత్‌ఫీల్డ్‌లో జన్మించిన గినా రైమోండో, ఒక నిష్ణాత అమెరికన్‌ రాజకీయవేత్త. వ్యాపారవేత్త. 2021 మార్చి 3 నుండి, ఆమె 40వ అమెరికా వాణిజ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. డెమొక్రాటిక్‌ పార్టీ సభ్యురాలిగా, 2015, జనవరి 6 నుంచి 2021, మార్చి 2, పనిచేసిన రోడ్‌ ఐలాండ్‌ గవర్నర్‌గా ఎన్నికైన మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

పీట్‌ బుట్టిగీగ్‌
పీట్‌ బుట్టిగీగ్‌ ఒక అమెరికన్‌ రాజకీయవేత్త, పబ్లిక్‌ సర్వెంట్‌ ప్రస్తుతం యునైటెడ్‌ స్టేట్స్‌ సెక్రటరీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌గా పనిచేస్తున్నారు, 2021, జనవరి నుంచి ప్రెసిడెంట్‌ జోబైడెన్‌ ఆధ్వర్యంలో ఈ పదవిలో ఉన్నారు. ఇండియానాలోని సౌత్‌ బెండ్‌లో 1982, జనవరి 19న జన్మించారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్‌ మరియు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో రోడ్స్‌ స్కాలర్‌ చేశారు.