Whatsapp Features : మూడు బిలియన్లకు మించి యూజర్లతో సరికొత్త మెసేజింగ్ యాప్ గా వాట్సాప్ అవతరించింది. ఈ నేపథ్యంలో తన యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త సౌలభ్యాలను, సౌకర్యాలను అందిస్తోంది. కాలానికి అనుగుణంగా మార్పులతో ఆకట్టుకుంటున్నది. గతంలో వాట్సాప్ ద్వారా మెసేజ్ లు, ఫోటోల షేరింగ్ చేసే అవకాశం ఉండేది. ఆ తర్వాత వీడియో కాల్, వీడియోలు, పీడీఎఫ్ ఫైల్స్ షేరింగ్ వంటి సౌకర్యాలను అందుబాటులో తీసుకొచ్చింది. అయితే సాంకేతిక పరిజ్ఞానం సరికొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆర్టిఫిషియన్ ఇంటలిజెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లకు సరికొత్త సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాయిస్ నోట్..
వాట్సాప్ మాతృ సంస్థ మెటా వాయిస్ నోట్ ట్రాన్స్ క్రిప్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీడియో క్లిప్స్ ను సెండ్ చేసుకునే అవకాశాన్ని ఇటీవల యూజర్లకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సౌలభ్యాల వల్ల యూజర్లకు సరికొత్త అనుభూతి కలుగుతోంది. అయితే ఇప్పుడు వాట్సాప్ మాతృ సంస్థ మెటా మరొక సౌలభ్యాన్ని తీసుకొచ్చింది.. ఇంగ్లీష్ రాని వారి ఇబ్బందులను తీర్చేందుకు అద్భుతమైన ఫీచర్ల ను ప్రవేశపెట్టింది. ఇంగ్లీష్ రాని వారి కోసం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.15.8 లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.. ఇదే విషయాన్ని wabetainfo ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఫీచర్ ను స్క్రీన్ షాట్ ద్వారా తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేసింది.
రెండవ ఫీచర్ ఇది
ఇక మెటా అందుబాటులోకి తీసుకొచ్చిన మరో ఫీచర్ కూడా యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయం. బాటమ్ కాలింగ్ కోసం బీటా వెర్షన్ 2.24.12.14లో కాలింగ్ స్క్రీన్ కోసం కొత్త ఇంటర్ ఫేజ్ ను తెరపైకి తీసుకువచ్చింది. ఇది బాటమ్ కాలింగ్ కు అదనపు ఆకర్షణ తీసుకొస్తుందని వాట్సాప్ మాతృ సంస్థ మెటా చెబుతోంది. ఈ ఫీచర్ ను యూజర్లందరికీ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని మెటా చెబుతోంది.
కొత్తగా వచ్చే మార్పులు ఏంటంటే…
ఈ అప్డేట్స్ వల్ల వాట్సాప్ కాలింగ్ లో కనిపించే స్క్రీన్ లో బటన్స్ పెద్దవిగా, ప్రకాశం అందంగా కనిపిస్తాయి. ఈ స్క్రీన్ కూడా సెమీ ట్రాన్స్ ఫ రెంట్ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తుంది. బీటా టెస్టర్స్ కోసం వాయిస్ మెసేజ్ ట్రాన్స్ కిప్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ వల్ల యూజర్లకు వచ్చిన వాయిస్ మెసేజ్ లను వారికి అనువైన భాష లోకి తర్జుమా చేసుకొని వినే అవకాశం లభిస్తుంది. ఈ ఫీచర్ బీటా టెస్టర్ లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత దశలవారీగా మిగతా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని మెటా చెబుతోంది. ప్రస్తుతం నేరుగా వాట్సాప్ లోనే ట్రాన్స్ లేషన్ చేసుకొని సౌకర్యాన్ని మెటా కల్పిస్తోంది. ఇకపై ఏ భాష నుంచి అయినా మనకు కావాల్సిన భాషలోనే అనువాదం చేసుకోవచ్చు. ట్రాన్స్ లేషన్ కోసం వేరే యాప్స్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
ఎందుకీ మార్పు
వాట్సాప్ లో ఈ మార్పుల వల్ల యూజర్లను మరింత పెంచుకునేందుకు మెటా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బ్యాంకింగ్, లొకేషన్ షేరింగ్, వీడియో కాల్, గ్రూప్ వీడియో కాల్ వంటి అద్భుతమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చిన మెటా.. భవిష్యత్తు కాలంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మరిన్ని సదుపాయాలను యూజర్లకు కల్పించనుంది. భవిష్యత్తు కాలంలోనూ మరిన్ని అప్డేట్స్ ను ప్రవేశ పెట్టబోతున్నట్టు మెటా ఇప్పటికే ప్రకటించింది.