Bangladesh Train Crisis: సాధారణంగా మనం రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు బోగీలో కూర్చుంటాం.. మన గమ్యస్థానం రాగానే దిగి వెళ్ళిపోతాం.. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైలు బోగీలో కాకుండా.. రైలు మీద ప్రయాణించాలని అనుకోం. ఎందుకంటే ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాలని ఎవరూ అనుకోరు. ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రయాణం చేయాBangladesh Train Crisis: అది రైలా? షేరింగ్ ఆటోనా? అలా ప్రయాణిస్తే ప్రాణాలు గాలిలో కలవాల్సిందే! వైరల్ వీడియో లని ఎవరూ భావించరు. కానీ సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలు మాత్రం రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు. కాదు కాదు ప్రాణాలను గాలిలో దీపాల మాదిరిగా వదిలేశారు. ఇంతకీ ఆ సంఘటన ఎక్కడ జరిగింది అంటే..
బంగ్లాదేశ్లో పరిస్థితిలో రోజురోజుకు దారుణంగా మారిపోతున్నాయి. అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. అక్కడి పరిపాలకులకు పాలన మీద పట్టు చిక్కలేదు. పైగా ఆ దేశంలో దుర్భరమైన దారిద్ర్యం తాండవిస్తోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న గొడవల వల్ల ఆ దేశం లో పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆందోళనకారులు ఏమాత్రం తగ్గడం లేదు. తాత్కాలిక ప్రభుత్వం పరిపాలనను గాలికి వదిలేసింది. దీంతో అక్కడి ప్రజలు నరకం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ప్రజల అనుకూలంగా వసతులు ఉండవు. కేవలం అక్కడి పరిస్థితులకు అనుగుణంగానే ప్రజలు బతకాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్లో రోడ్లు అత్యంత దారుణంగా ఉంటాయి. నీటి సరఫరా కూడా భయంకరంగా ఉంటుంది. ఇక అక్కడి రైళ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బంగ్లాదేశ్లో రైల్వే వ్యవస్థ గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే అనేక వీడియోలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఆ వీడియోలో కనిపించిన దృశ్యాలు అక్కడి రైల్వే వ్యవస్థ తీరును తేట తెల్లం చేస్తున్నాయి.
Also Read: అమెరికా కాదు.. స్విట్జర్లాండ్ అంతకన్నా కాదు.. ప్రపంచంలో అత్యంత సుసంపన్నమైన దేశం ఇదే.
రైళ్లలో ప్రయాణికులకు అనుగుణంగా బోగీలు లేకపోవడంతో రైలు ఇంజన్, బోగీ పైకప్పు మీద కూర్చొని ప్రయాణిస్తున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి రాగానే పడుకొని.. ఆ తర్వాత మళ్లీ పైకి లేస్తున్నారు. లోకో పైలట్ క్యాబిన్లోనూ చాలామంది ప్రయాణికులు ఉండడం విశేషం. ఈ వీడియో బంగ్లాదేశ్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది.
“రైలులో సాధారణంగా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణిస్తారు. కానీ ఈ వీడియోని చూస్తుంటే రైలు చక్రాల మీద కూర్చొని కూడా ప్రయాణించేలాగా ఉన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ ఇంత దారుణంగా ఉంటే ఇక ప్రజలు మాత్రం ఏం చేస్తారు.. వేరే ప్రాంతాలకు వెళ్లాలి అనుకున్నప్పుడు.. ఉన్నచోటి నుంచి ఇతర ప్రాంతాలకు చేరుకోవాలి అనుకున్నప్పుడు.. ఇలా వెళ్లక.. ఇంకెలా వెళ్తారు? ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు.. ప్రజలు ఎనుకున్న ప్రభుత్వాలు సక్రమంగా పని చేయకపోతే ఇదిగో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రజలు కట్టిన పన్నులు పక్కదారిలో వెళ్ళినప్పుడు ఇటువంటి కష్టాలే ఎదుర్కోవాల్సి వస్తుందని” నెటిజన్లు వాపోతున్నారు. అయితే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకెళ్లినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు.