Mogalirekulu Sagar Sensational Comments: టీవీ సీరియల్స్ లో బాహుబలి సైజు హిట్టుగా నిల్చిన సీరియల్ మొగలి రేకులు(Mogali Rekulu). ఈ సీరియల్ అప్పట్లో ఒక సునామీ నే సృష్టించింది. అన్ని వర్గాల ప్రేక్షకులు జెమినీ టీవీ లో ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యే సమయం లో ఎలాంటి పనులు పెట్టుకోకుండా టీవీ ముందు కూర్చొని చూసేవారు. రిపీట్ టెలికాస్ట్ లో కూడా ఈ సీరియల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో హీరో గా నటించిన సాగర్(RK Sagar) కి అయితే అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ మామూలు రేంజ్ లో రాలేదు. ఆర్కే నాయుడు గా, మున్నా గా ద్విపాత్రాభినయం చేసి అద్భుతమైన మార్కులు కొట్టేశాడు. ఇదే స్టోరీ ని సినిమాగా తీసి ఉండుంటే అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు అయ్యేవి. మామూలు హీరో కాస్త స్టార్ హీరో అయ్యేవారు. సినిమాల్లో కూడా ఇప్పటి వరకు ఈ రెండు క్యారెక్టర్స్ పండించిన హీరోయిజం ని ఎవ్వరూ చూసుండరు.
అయితే హీరో సాగర్ కి ఈ సీరియల్ తర్వాత మంచి కెరీర్ ఉంటుందని అందరూ ఆశించారు. కానీ ఈ సీరియల్ తర్వాత ఆయన సినిమాల్లో హీరో గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేశాడు. సినీ కెరీర్ కోసం సీరియల్స్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలను కూడా వదులుకున్నాడు. కానీ లాభం లేకుండా పోయింది. ఈయన హీరో గా నటించిన సినిమాలు ఎప్పుడు విడుదల అయ్యాయో, ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా ఆడియన్స్ కి తెలియదు. అంత పెద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఆయన 100 అనే చిత్రం చేశాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చేత లాంచ్ చేయించారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా ఆర్కే సాగర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
Also Read: సనాతన ధర్మం కాన్సెప్ట్ మీదనే ‘హరి హర వీరమల్లు’.. యూత్ ఆడియన్స్ ఆదరిస్తారా?
‘మొగలి రేకులు’ సీరియల్ చేస్తున్న రోజుల్లోనే ఆయనకు రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్ లో ఒక క్యారక్టర్ చేసే అవకాశం వచ్చింది. దీనిపై సాగర్ స్పందిస్తూ ‘నా జీవితం లో అనవసరంగా ఈ సినిమాని ఒప్పుకొని చేసాను అని ఫీల్ అయిన చిత్రం ఏదైనా ఉందా అంటే అది మిస్టర్ పర్ఫెక్ట్ మాత్రమే. డైరెక్టర్ దశరధ్ గారు నాకు ఈ చిత్రం లో సెకండ్ హీరో రోల్ అని చెప్పి తీసుకున్నారు. అప్పట్లో నేను సీరియల్ లో ఉండడం వల్ల డేట్స్ సర్దుబాటు చేయడం చాలా కష్టమైంది. అయినప్పటికీ సర్డుబాటు చేసి ఇచ్చాను. తీరా షూటింగ్ కి వెళ్లిన తర్వాత విదేశాల్లో నన్ను మూడు రోజులు ఖాళీగా కూర్చోబెట్టారు. నేను డైరెక్టర్ గారికి ఫోన్ చేసి, అదేంటి సారి ఖాలీగా కూర్చోబెట్టారు. నేను మీకు డేట్స్ చాలా కస్టపడి ఇచ్చాను. ఇప్పుడు నా డేట్స్ వృధా చేసి మళ్ళీ అదనపు డేట్స్ ఇవ్వమంటే నా వల్ల కాదు అని చెప్పాను. అప్పుడు పక్కరోజు రమన్నారు, రెండు మూడు రోజులు షూటింగ్ చేశారు, కానీ నాకు అనుమానం వచ్చి డైరెక్టర్ ని అడిగాను. నాకు చెప్పిన క్యారక్టర్ ఇది కాదు కదా అని అడిగితే, సినిమాల్లో క్యారెక్టర్స్ అప్పుడప్పుడు ఇలాగే మారుతుంటాయి, సర్దుకోవాలి అన్నాడు. నేను ఒప్పుకోలేదు, నా క్యారక్టర్ ని సినిమా నుండి పీకేయండి, వేరే వాళ్ళతో చేసుకోండి అని చెప్పాను, కానీ ఉంచేశారు. చాలా బాధ వేసింది. అప్పుడే నేను చేస్తే హీరో రోల్స్ మాత్రమే చేయాలి,క్యారక్టర్ రోల్స్ చెయ్యకూడదు అని నిర్ణయం తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
“Mr. Perfect was a disappointing experience for me. When they approached me, they told me I was the second lead.
But once I went to the shoot, everything was completely different from what I was told. I honestly regret doing that film,” said actor RK Sagar. pic.twitter.com/Cy9gsdmIbI
— Movies4u Official (@Movies4u_Officl) July 8, 2025