Homeఅంతర్జాతీయంAustralian Senator: చరిత్రలో తొలిసారి: ఆస్ట్రేలియా పార్లమెంట్ లో భగవద్గీతపై సెనెటర్‌ ప్రమాణం..

Australian Senator: చరిత్రలో తొలిసారి: ఆస్ట్రేలియా పార్లమెంట్ లో భగవద్గీతపై సెనెటర్‌ ప్రమాణం..

Australian Senator: ఆస్ట్రేలియా పార్లమెంటు చరిత్రలో ఫిబ్రవరి 7న అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. చారిత్రక ఘట్టానికి వేదికైంది. భారత సంతతికి చెందిన బారిస్టర్‌ వరుణ్‌ ఘోష్‌.. ఆస్ట్రేలియా పార్లమెంటు సాక్షిగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆస్ట్రేలియన్‌ పార్లమెంట్‌ చరిత్రలో ఈ ఘటన సాధించిన తొలి సభ్యుడిగా చరిత్ర సృష్టించారు. భారతీయ హిందువల పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇప్పటికీ మన కోర్టుల్లో భగవద్గీతపైనే ప్రమాణం చేస్తారు. మన చట్ట సభల్లో భగవంతుని సాక్షిగా, మనస్సాక్షిగా మన ప్రజాప్రతినిధులు ప్రమాణం చేస్తుంటారు. కానీ, ఆస్ట్రేలియన్‌ పార్లమెంటులో మన పవిత్ర గ్రంథంపై భారతీయ సంతతికి చెందిన సెనెటర్‌(ఎంపీ) ప్రమాణం చేయడం గమనార్హం. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ ఎక్స్‌లో పోస్టు చేశాడు. ‘పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి మా కొత్త సెనేటర్‌ వరుణ్‌ ఘోష్‌కు స్వాగతం.. భగవద్గీతపై ప్రమాణం చేసిన మొదటి ఆస్ట్రేలియా సెనేటర్‌ సెనేటర్‌ ఘోష్‌’ అని తెలిపాడు. ‘సెనేటర్‌ ఘోష్‌ తన కమ్యూనిటీకి, వెస్ట్‌ ఆస్ట్రేలియన్ల కోసం బలమైన గొంతుకగా ఉంటారని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ కూడా వరుణ్‌ ఘోష్‌కు స్వాగతం పలికారు.

న్యాయవాదిగా..
ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో నివాసం ఉంటున్న వరుణ్‌ ఘోష్‌.. వృత్తిరిత్యా న్యాయవాది. అతను వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్‌ అండ్‌ లాలో పట్టా పొందాడు. గతంలో న్యూయార్క్‌లో ఫైనాన్స్‌ అటార్నీగా, వాషింగ్‌టన్‌లోని ప్రపంచ బ్యాంకు సలహాదారుగా పనిచేశాడు. వరుణ్‌ ఘోష్‌ తన రాజకీయ జీవితాన్ని పెర్త్‌లోని లేబర్‌ పార్టీతో ప్రారంభించాడు.

రిటైర్‌ అయిన సెనెటర్‌ స్థానంలో..
అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేయబోతున్న సెనెటర్‌ పాట్రిక్‌ డాడ్సన్‌ స్థానంలో వరుణ్‌ ఘోష్‌ సెనెటర్‌గా ఎంపికయ్యారు. 17 ఏళ్ల వయసులోనే వరుణ్‌ ఘోష్‌ లేబర్‌ పార్టీలో చేరారు. భారతీయ – ఆస్ట్రేలియన్‌ బారిస్టర్‌ అయిన ఘోష్‌ గతవారం లేబర్‌ పార్టీ అధికారికంగా కీలక పాత్రకు ఎంపిక చేసింది. ఫెడరల్‌ పార్లమెంట్‌ సెనేట్‌లో పశ్చిమ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడానికి లెజిస్లేటివ్‌ అసెంబ్లీ, లోజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సెనేటర్‌గా వరుణ్‌ ఘోష్‌ను ఎన్నుకున్నాయి.

ఎవరీ వరుణ్‌ ఘోష్‌..?
1997లో భారత దేశం నుంచి స్ట్రేలియాలోని పెర్త్‌కు వెళ్లిన న్యూరాలజిస్టు తల్లిదండ్రుల కుమారుడు వరున్‌. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా యూనివర్సిటీలో కళలు, న్యాయశాస్త్రం అభ్యసించారు. తర్వాత స్కాలర్‌షిప్‌పై కేంబ్రిడ్జిలోని డార్విన్‌ కాలేజీలో చదివాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version