https://oktelugu.com/

Sreemukhi: అన్నం తింటుందా అందం తింటుందా… రెడ్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసే శ్రీముఖి గ్లామర్! లేటెస్ట్ ఫోటోలు వైరల్

పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చింది. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో ఈటీవీలో పటాస్ ప్రసారమైంది. శ్రీముఖితో పాటు రవి యాంకర్ గా చేశారు. శ్రీముఖి యాంకర్ గా ఎదుగుతున్న క్రమంలో బిగ్ బాస్ షోకి వెళ్ళింది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 7, 2024 / 02:35 PM IST
    Follow us on

    Sreemukhi: శ్రీముఖి అనతికాలంలో స్టార్ యాంకర్ గా ఎదిగింది. ప్రస్తుతం బుల్లితెర మీద సందడి ఆమెదే. అందరి కంటే ఎక్కువ షోలలో యాంకర్ గా కనిపిస్తుంది. సూపర్ సింగర్, స్టార్ మా పరివార్ తో పాటు మరికొన్ని షోలకు ఆమె యాంకర్ గా వ్యవహరిస్తోంది. అటు ఓటీటీలో సైతం సత్తా చాటుతుంది. ఆహా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షో యాంకరింగ్ బాధ్యత శ్రీముఖి తీసుకుంది. సుమ నెమ్మదించడం, అనసూయ బుల్లితెరకు గుడ్ బై చెప్పడం శ్రీముఖికి కలిసొచ్చింది.

    పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చింది. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో ఈటీవీలో పటాస్ ప్రసారమైంది. శ్రీముఖితో పాటు రవి యాంకర్ గా చేశారు. శ్రీముఖి యాంకర్ గా ఎదుగుతున్న క్రమంలో బిగ్ బాస్ షోకి వెళ్ళింది. హౌస్లో శ్రీముఖి తన ఆట తీరుతో మెప్పించింది. ఏకంగా టైటిల్ కోసం పోటీపడింది. ఫైనల్ లో రాహుల్ సిప్లిగంజ్-శ్రీముఖి నిలిచారు. రాహుల్ సిప్లిగంజ్ కి సింపథీ వర్క్ అవుట్ అయ్యింది. దాంతో అతడు విన్నర్ అయ్యాడు.

    శ్రీముఖి టైటిల్ కోల్పోయినా రెమ్యూనరేషన్ రూపంలో భారీగా ఆర్జించినట్లు సమాచారం. బిగ్ బాస్ షో శ్రీముఖి ఇమేజ్ కి ప్లస్ అయ్యింది. మెల్లగా బుల్లితెర మీద శ్రీముఖి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ఒకేసారి అరడజను షోలకు యాంకరింగ్ చేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం శ్రీముఖి సంపాదన కోట్లలో ఉంది. హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ నిర్మించిన శ్రీముఖి పేరెంట్స్ తో కలిసి అక్కడే ఉంటుంది. యాంకరింగ్ తో పాటు ప్రొమోషన్స్ ద్వారా శ్రీముఖి భారీగా సంపాదిస్తుంది.

    తరచుగా శ్రీముఖి పెళ్లి వార్తలు వస్తుండగా ఆమె ఖండిస్తున్నారు. అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె తేల్చి చెప్పారు. శ్రీముఖి నటిగా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేశారు. హీరోయిన్ గా సైతం నటించారు. గత ఏడాది విడుదలైన భోళా శంకర్ చిత్రంలో శ్రీముఖి రొమాంటిక్ రోల్ చేసింది. ఇక శ్రీముఖికి ఆఫర్స్ వస్తున్నా… ఆచితూచి ఎంచుకుంటున్నారని సమాచారం. సిల్వర్ స్క్రీన్ మీద కూడా శ్రీముఖి సత్తా చాటే అవకాశం లేకపోలేదు.