Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా అధ్యక్ష అభ్యరులపై హత్యాయత్నం జరుగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై ఇప్పటికే రెండుసార్లు అటాక్ జరిగింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కార్యాలయంపై ఒకసారి దాడి జరిగింది. తాజాగా ట్రంప్‌పై మరోమారు హత్యాయత్నం జరిగింది. ఎన్నికలకు 17 రోజుల ముందు మళ్లీ హత్యాయత్నం జరగడం కలకలం రేపింది. ఇటీవల కాలిఫోర్నియాలోని కొచెల్లాలో నిర్వహించిన ట్రంప్ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి రెండు గన్నలతో సంచరించాడు. పక్కా సమచారంతో సీక్రెట్ సర్వీస్ అలర్ట్ అయింది. అనుమానితుడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడిని లాస్‌వెగస్‌కు చెందిన వేం మల్లర్(49)గా గుర్తించారు. అయితే ట్రంప్‌కు గానీ, ర్యాలీకి హాజరైనవారికి గానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నిందితుడి వద్ద లోడెడ్ గన్..
ఇక నిందితుడు నకిలీ ప్రెస్ కార్డు, ఎంట్రీ పాస్తో ర్యాలీ వేదికకు సమీపంలో లోడ్ చేసిన షాట్ గన్, హ్యాండ్‌ను, హైకెపాసిటీ మ్యాగజైన్‌తో తిరుగుతండగా పోలీసులు పట్టుకున్నారు. అతడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే మితవాద సంస్థలో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు. సీక్రెట్ సర్వీసెస్ సహాయంతో ట్రంప్‌పై జరగబోయే మహో హత్యాయత్నాన్ని ఆపగలిగామని పేర్కొన్నారు. రివర్స్‌డ్ కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు శనివారమే జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. అతడి వాహనానికి రిజిస్ట్రేషన్ కూడా లేదు. కారులో మందుగుండు సామగ్రి, తుపాకులు దొరికినట్లు అధికారులు తెలిపారు. నకిలీ పాస్‌పోర్టు, డ్రైవింగ లైసెన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. హత్య తర్వాత విదేశాలకు పారిపోయేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు గుర్తించారు.
ఆరోపణలను కొట్టిపారేసిన నిందితుడు..
ఇదిలా ఉంటే.. పోలీసుల విచారణలో నిందితుడు తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. తాను ట్రంప్ మద్దతుదారుడినని తెలిపారు. తనవద్ద ఉన్న ఆయుధాలను 2022లో వ్యక్తిగత రక్షణ కోసం కొనుగోలు చేశానని వెల్లడించాడు. వాటిని తీసుకుని బట్లర్ ప్రాంతం మీదుగా వెళ్తున్న సమయంలో పోలీసులు దాడిచేసి పట్టించుకున్నారని, తన వాహనం స్వాధీనం చేసుకున్నారని వెల్లడించాడు.
గతంలో రెండుసార్లు హత్యాయత్నం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. గత జూలైలో పెన్సిల్వేనియాలో థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడు. ఈ సమయంలో బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ దూసుకెళ్లింది. వేగంగా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్పందించి కాపాడారు. తర్వాత ఫ్లోరిడాలోని వెస్ట్‌పా బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా హత్యాయత్నం జరిగింది. ఫెన్సింగ్ నుంచి నిందితుడు తుపాకీతో రావడాన్ని గమనించిన భద్రతాబలగాలు కాల్పులు జరిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.