YouTube unskippable ads: ఫోన్లలో యూట్యూబ్ చూడటం సర్వసాధారణం. కానీ కొంతకాలంగా మారిన టెక్నాలజీ వల్ల చాలామంది టీవీలలోనే యూట్యూబ్ వీక్షిస్తున్నారు. నచ్చిన వీడియోలను చూసేస్తున్నారు. రీల్స్, షార్ట్స్, సినిమాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో యూట్యూబ్ లో వీక్షిస్తున్నారు. ఓ వేదిక ప్రకారం గృహిణులు.. వృద్ధులు ఎక్కువగా యూట్యూబ్ ను టీవీలలో చూస్తున్నారు.
టీవీలలో యూట్యూబ్ చూసేవారు ఇటీవల కాలంలో పెరిగిపోయారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న యూట్యూబ్ సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం టీవీలలో స్కిప్ చేయడానికి వీలు లేకుండా 90 సెకండ్ల పాటు unscapable యాడ్స్ ప్రసారం చేయనుంది. ప్రయోగ దశలో ఉంది. యూజర్లను ప్రీమియం వైపు మళ్ళించడమే దీని ఉద్దేశమని తెలుస్తోంది. ఆదాయం పెంచుకునే క్రమంలో యూట్యూబ్ ఈ విధానాన్ని తీసుకొచ్చిందని సమాచారం. ఇప్పటికే ఓటీటీలో అన్ని యాప్స్ ఇదే ధోరణి కొనసాగిస్తున్నాయి. ఇటీవల జియో హాట్ స్టార్ రెండు రకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రీమియంలో కూడా రెండు కేటగిరీలను పెట్టింది.
యూట్యూబ్ కూడా అదే దారిలో వెళ్తోంది. రెవెన్యూ పెంచుకోవడమే మార్గంగా ప్రణాళికలు రూపొందిస్తుంది. పైగా ఖర్చును కూడా తగ్గించుకుంటున్నది. ఇప్పటికే విడుతలవారీగా ఉద్యోగులను తగ్గించిన యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు చెల్లించే డబ్బు విషయంలో కూడా అనేక నిబంధనలను పాటిస్తోంది. గతంలో ఉదారంగా డబ్బులు ఇచ్చే యూట్యూబ్.. కొంతకాలంగా చెల్లింపులకు పూర్తిగా కత్తెర వేసింది. దీంతో కంటెంట్ క్రియేటర్లు చాలావరకు ఆదాయాన్ని కోల్పోతున్నారు. పేరు మోసిన చానల్స్ మినహా.. మిగతా వాటికి ఆశించిన స్థాయిలో డబ్బులు రావడం లేదు.
యూట్యూబ్ యాజమాన్యం మొదట్లో ప్రాచుర్యం పొందడానికి మొదట్లో విరివిగా డబ్బులను ఖర్చుపెట్టింది. ఆ తర్వాత ఖర్చును పూర్తిగా తగ్గించుకున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నది. కంటెంట్ చెకింగ్ లో కూడా గతంలో మాదిరిగా ఉదారంగా వ్యవహరించడం లేదు. అందువల్లే చాలామంది కంటెంట్ క్రియేటర్లు యూట్యూబ్లో వీడియోలను అంతగా అప్లోడ్ చేయడం లేదు. ఇంత జరుగుతున్నప్పటికీ యూట్యూబ్ యాజమాన్యం వెనక్కి తగ్గడం లేదు. పైగా, ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక రకాల మార్గాలను అన్వేషిస్తుంది. యూట్యూబ్ తీసుకురాబోయే ఈ నిబంధనల పట్ల టీవీ వీక్షకులు అసంతృప్తితో ఉన్నారు. కాలక్షేపం కోసం యూట్యూబ్ చూస్తుంటే.. మధ్యలో ఈ యాడ్స్ గోల ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.