Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీYoutube Down: You Tube కు ఏమైంది.. ఒక్కసారిగా డౌన్ ఎందుకు?

Youtube Down: You Tube కు ఏమైంది.. ఒక్కసారిగా డౌన్ ఎందుకు?

Youtube Down: ప్రపంచ వ్యాప్తంగా వీడియో మాధ్యమాలలో విశేషమైన ప్రాచుర్యం పొందింది యూట్యూబ్. గూగుల్ దీనికి పేరెంట్ కంపెనీగా వ్యవహరిస్తోంది. గూగుల్ సాధిస్తున్న లాభాలలో అధికంగా యూట్యూబ్ నుంచి వస్తూ ఉండటం విశేషం. యూట్యూబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామందికి అది ఒక ఆదాయ వనరుగా మారిపోయింది.

చాలామంది చానల్స్ ఏర్పాటు చేసుకోవడం.. వాటి ద్వారా సొంత కంటెంట్ రూపొందించడం వంటివి చేస్తున్నారు. ఒరిజినల్ కంటెంట్ ప్రాచుర్యం పొందుతే వారంతా కూడా సెలబ్రిటీలు అవుతున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది సెలబ్రిటీలకు సొంత చానల్స్ ఉన్నాయి. సొంత ఛానల్స్ ద్వారా భారీగా ఆదాయాన్ని సెలబ్రిటీలు పొందుతున్నారు.

యూట్యూబ్ విశేషమైన ఆదరణ పొందిన నేపథ్యంలో చాలామంది అందులో నిత్యం వీడియోలు చూస్తూనే ఉన్నారు. దినదిన ప్రవర్తమానంగా యూట్యూబ్ ఎదిగింది. అందులో రకరకాల వీడియోలు అందుబాటులో ఉండడంతో చాలామందికి ఒక వ్యసనం లాగా మారిపోయింది. యూట్యూబ్ లో రకరకాల చానల్స్ అందుబాటులో ఉన్నాయి. చదువు నుంచి మొదలుపెడితే వంటల వరకు.. ట్రావెలింగ్ నుంచి మొదలుపెడితే ఆధ్యాత్మికం వరకు ఇలా ప్రతి అంశం యూట్యూబ్లో కనిపిస్తూనే ఉంటుంది.

ఇంతటి ఆదరణ పొందిన యూట్యూబ్ ఒక్కసారిగా షట్ డౌన్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. యూట్యూబ్ మీద చాలామంది ఆధారపడి బతుకుతున్న నేపథ్యంలో అది షట్ డౌన్ కావడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనిపై యూట్యూబ్ మాతృ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. మొబైల్, డెస్క్ టాప్ లలో యూట్యూబ్ ఓపెన్ కాలేదు. యాక్సెస్ చేయాలని చాలామంది ప్రయత్నించినప్పటికీ.. సంథింగ్ వెంట్ రాంగ్ అని చూపించింది. దీంతో చాలామంది యూసర్లు యూట్యూబ్ ను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. గతంలో కూడా ఫేస్బుక్ ఇలానే పనిచేయలేదు. ట్విట్టర్ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. వాడకం పెరిగిపోవడం వల్ల సర్వర్ మీద ఒత్తిడి ఎక్కువైందని.. అందువల్లే ఇలా జరిగి ఉంటుందేమోనని టెక్ నిపుణులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి వరకు సేవలలో అంతరాయం ఏర్పడినప్పటికీ.. ఆ తర్వాత సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి.

యూట్యూబ్ కు సంబంధించి గూగుల్ కంపెనీ అత్యంత ఆధునికమైన సర్వర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ సర్వర్ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు పకడ్బందీ డాటా సెంటర్లు నిర్మించింది. అయినప్పటికీ ఈ అంతరాయం రావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ సమస్య తాత్కాలికమేనని.. మరోసారి ఉత్పన్నం అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version