Homeఅంతర్జాతీయంAuntie remark UK: ఆంటీ.. ష్.. ఇలా ఎవరినీ పిలవకండి.. ఇంత రచ్చ జరిగింది మరి

Auntie remark UK: ఆంటీ.. ష్.. ఇలా ఎవరినీ పిలవకండి.. ఇంత రచ్చ జరిగింది మరి

Auntie remark UK: ఒకప్పుడు వరుసలతో పిలిచేవాళ్ళు. ఇప్పుడు వరుసలు మాయమైపోయాయి ఆంటీ, అంకుల్ మాత్రమే పిలుపులుగా చేరిపోయాయి. ఎంత వయసున్నా సరే ఆంటీ అని పిలవడం లేదా అంకుల్ అని సంభాషించడం పరిపాటిగా మారిపోయింది. నేటి కాలంలో చదువులు అలా తగలబడ్డాయి మరి. అందరూ సిటీలలో ఉంటున్నారు. పిల్లల చదువులు పూర్తిగా కార్పొరేట్ మయం అయిపోయాయి. జీవితాలు ఎంతలా మారిపోయాయో.. వరుసలు కూడా అదే స్థాయిలో దారి తప్పాయి.

ఆంటీ అనే పిలుపును ఏ ఆంటీ కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఆడవాళ్లు వయసు మళ్ళినా సరే.. తమ ఇప్పటికీ యుక్త వయసులో ఉన్నామని అనుకుంటారు. అఫ్కోర్స్ ఇందులో మగవాళ్ళు కూడా తక్కువ కాదు. ఉదాహరణకు అనసూయను తీసుకుంటే.. ఆమె మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటుంది. ఆమెను కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆంటీ అని పిలిచి ట్రోల్ చేశారు. ఆమెకు ఎక్కడో కాలింది. ఇంకేముంది సోషల్ మీడియాలోనే చెడామడా తిట్టేసింది.. ఆ తర్వాత ఆమెకు సందర్భాల్లో తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకుంది. తాను వయసు మళ్ళిన దానిని కాదని.. తనను ఆంటీ అని పిలిస్తే బాగోదని హెచ్చరించింది. కొన్ని సందర్భాలలో తన ఆవేదనను చెప్పుకుంది.

అనసూయ ఎపిసోడ్ అంటే సాఫ్ట్ గా సాగిపోయింది. కానీ బ్రిటన్ లో భారతీయ మూలాలు ఉన్న ఓ మహిళ ఆంటీ అనే పిలుపును పరమకంపరంగా భావించింది. తనను అదే పనిగా పిలుస్తూ ఉంటే ఓపిక నశించింది.. ఏకంగా కోర్టు దాకా వెళ్ళింది. తన మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడింది. ఆమె వాదనతో కోర్టు కూడా ఏకీభవించింది. చివరికి ఒక లక్ష 76,700 జరిమానా విధించింది.

లండన్ లోని వెస్ట్ లండన్ నేషనల్ హెల్త్ సర్వీసు భాగంలో భారతీయ మూలాలు ఉన్న ఒక నర్స్ పనిచేస్తున్నారు. ఆమెను ఘనా దేశానికి చెందిన ఓ మహిళ ఆంటీ అని పిలుస్తోంది. అనేక సందర్భాలలో ఇలా పిలవడంతో భారతీయ నర్స్ కు ఆగ్రహం కలిగింది. తనను అలా పిలకూడదని చెప్పింది. ఆయనప్పటికీ ఘనా మూలాలు ఉన్న మహిళ తన ధోరణి మార్చుకోలేదు. దీంతో భారతీయ మూలాలు ఉన్న నర్స్ కోర్టుకు వెళ్ళింది.

కోర్టు లో న్యాయమూర్తి ఈ కేసు పూర్వపరాలను విన్నారు. వాదనలు గత ఏడాది పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో గత నెలలో న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. అయితే ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.. విచారణ సమయంలో సదరు ఘనా నర్స్ తాను పిలిచిన పిలుపును సమర్ధించుకుంది. తనకంటే వయసు ఎక్కువగా ఉంది కాబట్టి అలా పిలవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. అయితే ధర్మాసనం ఆమె వాదనతో ఏకీభవించలేదు. ఒక మహిళకు వయసు మళ్లినంత మాత్రాన ఆంటీ అని పిలవకూడదని ధర్మాసనం చెప్పింది. తనను అలా పిలవకూడదని ఆ మహిళ చెప్పినప్పుడు ఉద్దేశపూర్వకంగా మీరు చేసినట్టు అర్థం అవుతుందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

“మీకు అనేక సందర్భాలలో ఆమె చెప్పింది. అయినప్పటికీ మీరు అదే పనిగా ఆమెను పిలవడం మొదలుపెట్టారు. ఇది వ్యక్తిత్వ హననం కాదా. దీనిని మీరు ఎలా సమర్థించుకుంటారు.. మీరు అలా పిలవాల్సిన అవసరం ఏముంది.. మీకంటే వయసులో పెద్దది కాబట్టి మేడం అని పిలవచ్చు కదా.. అలాకాకుండా ఆంటీ అని పిలవడంలో అంతరార్థం ఏమిటి.. దీనిని బట్టి మీ లోపల ఏదో కుట్ర దాగి ఉందని అర్థమవుతుందని” ధర్మాసనం అభిప్రాయపడింది.. ఈ పూర్తిగా జాత్యహంకారం కిందికి వస్తుందని కోర్టు పేర్కొంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version