US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సర్వేలు నిజమవుతాయా? బెట్టింగ్‌ మార్కెట్‌లో ట్రంప్‌ గెలవబోతున్నాడా?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో ఐదు రోజుల్లో జరుగనున్నాయి. ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఎన్నికల ఏర్పాట్లు కూడా పూర్తి కావొచ్చాయి. ఈ తరుణంలో బెట్టింగ్‌లు మొదలయ్యాయి.

Written By: Raj Shekar, Updated On : November 1, 2024 8:40 am

US Presidential Election 2024(1)

Follow us on

US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఆసక్తి చేపుతున్నాయి. ఉత్కంఠగా సాగుతున్నాయి. సర్వే సంస్థలకు కూడా ఓటరు నాడి చిక్కడం లేదు. సెప్టెంబర్‌ వరకు కమలా హారిస్‌ ముందంజలో ఉండగా, అక్టోబర్‌ సర్వేలో ట్రంప్‌ లీడ్‌లోకి వచ్చారు. అయితే ఇద్దరి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉండడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరు అనే అంశంపై జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. తాజా సర్వే ప్రకారం.. ట్రంప్‌ ఒక శాతం ఆధిక్యంలో ఉన్నారు. తాజా ఫలితాలే నిజం అవుతాయని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అంటున్నారు. బుధవారం(అక్టోబర్‌ 30న) విడుదలైన ఫాక్స్‌ పోల్‌ ప్రకారం.. స్వింగ్‌ స్టేట్స్‌ అయిన పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినాలో ట్రంప్‌–హారిస్‌ కన్నా ఒక శాతం పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇక మిషిగ రాష్ట్రంలో ఇద్దరి మధ్య టై అవుతుంది. అరిజోనా, నవెడా, జార్జియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు ఉంటుందని ఫాక్స్‌ పోల్‌ అంచనా వేసింది. ఇక సీఎన్‌ఎస్‌ పోల్‌ పెన్సిల్వేనియాలో 48 శాతం ఓట్లతో ట్రంప్, హారిస్‌ మధ్య టై అవుతుందని తెలిపింది. విస్కాన్సిన్‌లో 4 శాతం పాయింట్లు, మిషిగన్‌లో 5 శాతం పాయింట్లతో ట్రంప్‌.. కమలా హారిస్‌ కన్నా ముందు ఉన్నారనితెలిపింది. ఇక సీబీఎస్‌ పోల్‌ ప్రకారం.. పెన్సిల్వేనియాలో 49 శాతం ఓట్లతో ఇద్దరికీ టై అవుతుందని తెలిపింది.

బెంట్టింగ్‌ల జోరు..
సర్వేలు ఇలా ఉండగా, ఈ ఫలితాల ఆధారంగా అమెరికాలో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. హారిస్‌ కన్నా ట్రంప్‌ 0.4 శాతం పాయింట్లతో ముందు ఉన్నట్లు సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. వీటి ఆధారంగానే చాలా మంది బెట్టింగ్‌లకు దిగుతున్నారు. బెట్టింగ్‌ మార్కెటక్ష ట్రంప్‌ 63.1 శాతంతో ముందుకు దూసుకెళ్తుండగా, కమలా హారిస్‌ 35.8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

మిక్స్‌డ్‌ ఎమోషన్స్‌..
అధ్యక్ష ఎన్నికల ప్రచారంపై 10 మందిలో ఏడుగురు అమెరికన్లు విసుగు, ఆందోళన చెందుతున్నారని ఏపీ అండ్‌ ఎన్‌ఓఆర్‌సీ సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ రీసెచ్చ్‌ నివేదిక తెలిపింది. అంతే మొత్తంలో ఆసక్తిగా కూడా ఉన్నట్లు పేర్కొంది. ఇక మూడింట ఒకటో వంతు ఉత్సాహంగా ఉన్నట్లు వెల్లడించింది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలపై అమెరికన్లు భావోద్వేగాలు తీవ్రస్థాయిలో ఉన్నట్లు తెలిసింది. గత న్నికలతో పోలిస్తే.. ఓటర్లలో నిరాశస్థాయి స్థిరంగా ఉందని పేర్కొంది.