https://oktelugu.com/

China: మరో వైరస్ విజృంభణ.. కిటకిటలాడుతున్న ఆసుపత్రులు.. ఇంతకీ చైనాలో ఏం జరుగుతోంది?

చైనాలో ఏం జరిగినా అది అంతిమంగా ప్రపంచం మీద ప్రభావం చూపిస్తుంది. కరోనా ముందుగా వెలుగులోకి వచ్చింది చైనాలోనే.. ఆ తర్వాతే ప్రపంచం మొత్తం విస్తరించింది. దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రపంచం నరకం చూసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 3, 2025 / 09:04 AM IST

    China(2)

    Follow us on

    China: లక్షల మంది చనిపోయారు. అదే స్థాయిలో కంపెనీలు మూతపడ్డాయి. ఉపాధి లభించక చాలామంది ఆకలి మరణాలకు గురయ్యారు. ఇప్పటికీ కొన్ని రంగాలలో పురోగతిలేక.. అవి శాశ్వతంగా మూతపడ్డాయి. కోవిడ్ తర్వాత చైనా ఆర్థిక పరిస్థితి కూడా మారిపోయింది. అక్కడ రియాల్టీ రంగం దారుణంగా దెబ్బతిన్నది.. ఇప్పటికే వేలాది కోట్లు నష్టపోయింది. అయితే చైనాలో ఇప్పుడు మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. ఆ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అందరిలోనూ టెన్షన్ పెరిగిపోయింది. కరోనా మాదిరిగానే అది కూడా శ్వాస కోశ వ్యాధికి సంబంధించింది. దీనిని హ్యూమన్ మెటాన్యుమో వైరస్ అని పిలుస్తున్నారు. ఇది కోవిడ్ 19 మాదిరిగానే వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటున్నాయి. ప్రస్తుతం చైనాలో శీతాకాలం కావడంతో వైరస్ బాధితులు ఆస్పత్రులకు క్యూపడుతున్నారు. కేవలం ఈ వైరస్ మాత్రమే కాకుండా, ఇన్ ఫ్లూయంజా, ఏ మైకో ప్లాస్మా న్యుమోనియా, కోవిడ్ -19 వంటి వైరస్ ల బారిన పడిన వారు కూడా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

    ఇప్పుడే ఎందుకు ఈ వైరస్

    ప్రస్తుతం చైనాలో శీతాకాలం.. చైనాలో కాలుష్యం అధికంగా ఉంటుంది. ప్రతి ఏడాది అక్కడ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు పెరిగిపోతుంటారు. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపు కావడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారి రక్త నమూనాలను వైద్యులు పరిశీలించగా.. వారిలో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఇతర కేసులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కనీసం పడకలు సరిపోకపోవడంతో.. ఓకే బెడ్ మీద ఇద్దరికీ చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఇతర దృశ్యాలు సామాజిక మధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. ” ఇప్పటికే ప్రపంచం కరోనా వల్ల తీవ్ర ఇబ్బంది పడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. ఈ సందర్భంలోనే ఇలాంటి వైరస్ వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఇది గనుక ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. ఇప్పటికే చాలా దేశాలు ఆర్థికంగా చిద్రమైపోయాయి. ఈ వైరస్ వల్ల వాటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందోనని” శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు ఒక్క మరణం కూడా చోటు చేసుకోలేదని చైనా అధికారిక మీడియా చెబుతోంది. వైరస్ వ్యాప్తి ఉందన్న విషయం వాస్తవమేనని.. కాకపోతే పరిస్థితి అదుపులో ఉందని చైనా మీడియా వ్యాఖ్యానిస్తోంది. శీతాకాలం కావడంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరిగిందని.. అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదని.. కచ్చితంగా వైరస్ అదుపులో ఉందని చెబుతోంది.