Rajinikanth : మన సౌత్ నుండి గ్లోబల్ వైడ్ గా మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన చాలు అనుకునే ఆర్టిస్టులు, హీరోయిన్లు ఎంతో మంది ఉంటారు. ఎందుకంటే ఆయన సినిమాలో కాసేపు కనిపించినా ప్రపంచం మొత్తం చూస్తుంది అనే ఆశ ఉంటుంది కాబట్టి. 7 పదుల వయస్సు దాటినా ఇప్పటికీ ఆయన నేటి తరం స్టార్ హీరోలతో సమానంగా వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతున్నాడు. అలాంటి స్టార్ పక్కన నటించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి?, కానీ ఒక హీరోయిన్ మాత్రం రజినీకాంత్ సినిమాలో ఎందుకు నటించాను అని చాలా ఫీల్ అయ్యిందట. ఆమె మరెవరో కాదు కుష్బూ. ఈమెకి ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో ఏ రేంజ్ క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
తమిళనాడు లో అప్పట్లో ఈమెకి దేవాలయాలు కూడా కట్టారు అభిమానులు. అంతటి అభిమానం సంపాదించుకున్న ఈమె ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో రాణిస్తున్న ఈమె ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి కూడా జడ్జి గా వ్యవహరిస్తుంది. రాజకీయాల్లో కూడా రాణించింది. అయితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ నేను కొన్ని సినిమాలు ఎందుకు చేసానురా బాబు అని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. నార్త్ లో కంటే ఎక్కువగా సౌత్ లోనే సినిమాలు చేశాను. నార్త్ ఇండియా లో చేసిన సినిమాల గురించి నేనెప్పుడూ బాధపడలేదు. కానీ సౌత్ లో నేను నటించిన కొన్ని సినిమాలు అనవసరంగా చేశాను అని ఫీల్ అయ్యాను. ఉదాహరణకు నేను ఒక రజినీకాంత్ సినిమాకి సంతకం చేశాను. నాతో పాటు అందులో మీనా కూడా హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఇద్దరికీ సమానమైన రోల్స్ అన్నారు. నా పాత్ర తెగ నచ్చేసింది. వెంటనే ఆ చిత్రానికి ఓకే చెప్పేసాను. కానీ సెట్స్ కి వెళ్లిన తర్వాత మొత్తం మారిపోయింది. నాకు చెప్పింది వేరు, అక్కడ తీస్తున్న సినిమా వేరు. మా ఇద్దరి పాత్రలకంటే, వేరే వాళ్ళ పాత్రలకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కింది. ఇదేంటి ఒకటి చెప్పి ఇంకోటి తీస్తున్నారు అనుకున్నాను. ఎలాగో కమిట్ అయిన సినిమా కాబట్టి గొడవ పడలేక పూర్తి చేసి వచ్చాను. కానీ ఆ సినిమా ఎందుకు చేశాను అనే బాధ ఇప్పటికీ ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది కుష్బూ.ఇంతకు ఆమె చెప్పుకొచ్చిన సినిమా మరేదో కాదు, పెద్దన్న. రజినీకాంత్ కెరీర్ లోనే ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.