https://oktelugu.com/

Ram Charan : ‘మహేష్, రాజమౌళి సినిమా ఒకటిన్నర సంవత్సరం లోపే వచ్చేస్తుంది’ అంటూ రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' మూవీ థియేట్రికల్ ట్రైలర్ నిన్న AMB సినిమాస్ లో మీడియా రిపోర్టర్స్ సమక్షం లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 3, 2025 / 09:04 AM IST

    Ram Charan

    Follow us on

    Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ నిన్న AMB సినిమాస్ లో మీడియా రిపోర్టర్స్ సమక్షం లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కి అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ కి రంగస్థలం, #RRR తర్వాత మరో గుర్తుండిపోయే పాత్ర దొరికిందని ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. యాంకర్ సుమ ఆయన్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగింది. అందులో మొదటి ప్రశ్న గా ‘టీజర్ లో ట్రైలర్ లో మీరు అన్ ప్రెడిక్టబుల్ అని చూపించారు కదా. శంకర్ గారు మీకు ఏ విషయం లో అన్ ప్రెడిక్టబుల్ అనిపించాడు’ అని అడుగుతుంది.

    దానికి రామ్ చరణ్ సమాధానం చెప్తూ ‘శంకర్ గారితో పని చేసేటప్పుడు ప్రతీ రోజు అన్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. మనం చిన్నప్పటి నుండి ఆయన పాటలను చూస్తూ పెరిగాము. నా సినిమాలో పాటలు కూడా ఆ రేంజ్ లో ఉంటాయని అనుకున్నాను. కానీ ఆయన అంతకు మించిన గ్రాండియర్ తో పాటలను చిత్రీకరించి నన్ను ఆశ్చర్యపోయేలా చేసారు. అలా ఆయన చర్యలు మొత్తం అన్ ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. మీ దృష్టిలో రాజమౌళి, శంకర్ గార్లలో ఎవరు టాస్క్ మాస్టర్ గా అనిపించారు అని సుమ అడగగా, దానికి రామ్ చరణ్ సమాధానం చెప్తూ ‘ఇద్దరు టాస్క్ మాస్టర్స్ యే..షాట్ మేకింగ్ లో వాళ్ళు అసలు తగ్గరు. రాజమౌళి, సుకుమార్ లతో పని చేసి నాకు బాగా అలవాటు అవ్వడంతో, శంకర్ గారు ఎక్కువ రోజులు తీసుకున్నా నాకు కష్టం గా అనిపించలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.

    సుమ మరో ప్రశ్న అడుగుతూ ‘ఈరోజు రాజమౌళి, మహేష్ బాబు గారి కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం ప్రారంభం అయ్యింది. ఈ సినిమా ఎన్ని ఏళ్లలో పూర్తి అవుతుందో చెప్పగలరా’ అని అడగగా, దానికి రామ్ చరణ్ సమాధానం చెప్తూ ‘ఎలాంటి అడ్డంకులు రాకపోతే ఈ చిత్రం ఒకటిన్నర సంవత్సరం లోపు పూర్తి అవుతుంది. అందులో ఎలాంటి భయాలు పెట్టుకోనవసరం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఈ భారీ ప్రాజెక్ట్ కేవలం ఏడాదిన్నర లోపే రాబోతుంది అన్నమాట. వాస్తవానికి #RRR మూవీ షూటింగ్ తొందరగానే అయిపోయేది. కానీ మధ్యలో కరోనా రావడం, లాక్ డౌన్ విధించడం తో షూటింగ్ బాగా ఆలస్యం అయ్యింది. అంతే కాకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు షూటింగ్ సమయంలో గాయాలు అవ్వడం వల్ల కొన్నాళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ ని ఆపేయాల్సి వచ్చింది. అలా అనేక అడ్డంకుల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది, అలాంటివి ఏమి లేకపోతే రామ్ చరణ్ చెప్పినట్టు ఈ చిత్రం తొందరగానే ప్రేక్షకుల ముందుకు రావొచ్చు.