America President Elections : అగ్రరాజ్యంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఇప్పటిఏ అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్‌ను ఎంచుకున్నారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఖరారయ్యారు. దీంతో ఇద్దరూ ప్రచారం కూడా మొదలు పెట్టారు. ముఖాముఖి డిబేట్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అనూహ్యంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. మరోవైపు డెమొక్రటిక్ అభ్యర్థి బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఆ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రేసులోకి వచ్చారు. అధికారికంగా పార్టీ ఇంకా ఖరారు చేయకపోయినా ఆమె బరిలో ఉంటారని తెలుస్తోంది. మాజీ అధ్యక్షులు క్లింటేన్, ఒబామాతోపాటు పలువురు పార్టీ సీనియర్లు, గవర్నర్లు హ్యారిస్‌కే మద్దతు ఇస్తున్నారు. దీంతో ఆగస్టులో జరిగే డెలిగేట్స్ మీటింగ్‌లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా ఖరారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఎన్నికల్లో పోటీ కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరుగుతుంది. ఇదిలా ఉంటే.. కమలా అభ్యర్థిగా ఖరారు కాకముందే ట్రంప్, రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ కమలా హ్యారిస్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. దీంతో కమలాకు అమెరికాలో మద్దతు పెరుగుతోంది. జేడీ.వాన్స్ గతంలో ఓ ఇంటర్వ్యూలో కమలాపై చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమలాకు పిల్లలు లేరని, పిల్లలు లేని తల్లికి పిల్లలను ఎలా చూసుకోవాలో తెలియదని.. అందుకే అమెరికాలో పిల్లలు పుట్టకుండా అబార్షన్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు కమలా సవతి పిల్లలు కమలాకు మనూహ్యంగా మద్దతు ఇచ్చారు. తాము కమలా పిల్లలమే అని ప్రకటించారు. అభ్యర్థిగా ఖరారు కాకముందే.. అమెరికన్లలో కమలాకు మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ అమెరికన్లు ఎవరికి మద్దతు ఇస్తారన్న ఆసక్తి ఇప్పుడు అమెరికన్లతోపాటు భారతీయుల్లోనూ నెలకొంది.
ఇండియన్ అమెరికన్లు ఎవరివైపు..
2020 అద్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఇమ్మిగ్రేషన వ్యతిరేక విధానాలు, జాత్యహంకార విధానాన్ని ఇండియన్ అమెరికన్లు వ్యతిరేకించారు. దీంతో ఆ ఎన్నికల్లో మెజారిటీ ఇండియన్ అమెరికన్లు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్‌కు మద్దతుగా నిలిచారు. రిపబ్లిక్ పార్టీకి ఓటు వేశారు. ట్రంప్‌ను మెజారిటీ భారతీయులు వ్యతిరేకించారు. అయితే ఈసారి డైనమిక్స్ ఈ సమూహంలో ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాల్పుల ఘటన తర్వాత ట్రంప్‌కు అనూహ్య మద్దతు పెరిగింది. అధ్యక్ష పదవికి మార్గం సుగమమైంది. ఘటన తర్వాత నిర్వహించిన ఓపీనియన్ పోల్స్‌లో బైడెన్ కన్నా ట్రంప్ ముందు ఉన్నారు. అయితే ఆ తర్వాత బైడెన్ రేసు నుంచి తప్పుకున్నారు. కమలా హ్యారిస్ పోటీ చేసే అవకాశాలు మెరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో కమలా రేసులోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా భారతీయ అమెరికన్లు ఒక్కసారిగా కమలావైపు మళ్లరు. దీంతో ఇండో అమెరికన్ల మద్దతులో కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నారు. డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్, ఆసియా – పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ వోట్ ఇటీవల నిర్వహించిన పోల్ ప్రకారం, భారతీయ అమెరికన్లలో అనుకూలత రేటింగ్ లో కమలా హ్యారిస్‌కు 54% మంది అనుకూలంగా ఉండగా, ట్రంప్‌కు 35 శాతం మంది మద్దతు తెలిపారు. ఇక హ్యారిస్ భారతీయ అమెరికన్లలో 21 శాతం పాయింట్లతో తోటి భారతీయ అమెరికన్ అయిన నిక్కీ హేలీని కూడా అధిగమించారు.
బైడెన్‌కు దక్కని మద్దతు..
ఇదిలా ఉంటే ట్రంప్, బైడెన్ మధ్య పోటీ నేపథ్యంలో గతంలో నిర్వహించిన పోల్‌లో బైడెన్‌కు 26 శాతం మంది, ట్రంప్‌కు 46 శాతం మంది మద్దతు తెలిపారు. ఇక 2020లో 72 శాతం మంది భారతీయ అమెరికన్లు బైడెన్‌కు మద్దతు తెలిపారు. ట్రంప్‌కు కేవలం 22 శాతం మద్దతు తెలిపారు. రాబోయే సెనేట్ రేసుల్లో 55% మంది భారతీయ అమెరికన్లు డెమొక్రాటిక్ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్లాన్ చేస్తున్నారు, అయితే 52% మంది ప్రతినిధుల సభకు డెమొక్రాట్‌లకు మద్దతు ఇస్తారు. రిపబ్లికన్ పార్టీకి 29% భారతీయ అమెరికన్లు రిపబ్లికన్‌లకు సెనేట్‌లో, 31% మంది సభలో ఓటు వేయాలని యోచిస్తున్నారు.
భారతీయ అమెరికన్లు 4.16 మిలియన్లు..
ఇదిలా ఉంటే అమెరికాలో భారతీయ అమెరికన్ జనాభా 4.16 మిలియన్లు. అమెరికా మొత్తం జనాభా 333 మిలియన్లు ఇందులో భారతీయ అమెరికన్లు 1.4 శాతం ఇందులో 2.62 మిలియన్లు పౌరులు. 1.9 మిలియన్ల మంది ఓటర్లు. దేశంలో నమోదైన మొత్తం ఓటర్లలో 0.82% ఉన్నారు. వారి సాపేక్షంగా తక్కువ శాతం ఉన్నప్పటికీ, స్వింగ్ స్టేట్స్‌లో భారతీయ అమెరికన్లు గణనీయమైన ప్రభావాన్ని చూపుతారు, ఇది ఎన్నికలను స్వల్ప తేడాలతో నిర్ణయించగలదు. హ్యారిస్, ట్రంప్ మధ్య 2024 రేసు చాలా దగ్గరగా ఉంటుందని, ప్రతీ ఓటు కీలకంగా ఉంటుందని భావిస్తున్నారు.