Homeక్రైమ్‌Crime News  : న్యాయవిద్య చదివిన దంపతులు గాడి తప్పారు.. గంజాయి మత్తుకు అలవాటు పడి...

Crime News  : న్యాయవిద్య చదివిన దంపతులు గాడి తప్పారు.. గంజాయి మత్తుకు అలవాటు పడి దారుణానికి ఒడిగట్టారు..

Crime News   : వారిద్దరూ దంపతులు. న్యాయవిద్య చదువుతున్నారు. మరికొద్ది రోజుల్లో వారి కోర్స్ పూర్తికానుంది. కోర్స్ పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ చేసి నలుగురికి ఉన్నతంగా జీవించాల్సిన వారు.. కట్టు తప్పారు. గంజాయికి అలవాటు పడ్డారు. దానికి పూర్తిగా బానిసలైపోయారు. ఇందులో భాగంగా అనేక అడ్డదారులు తొక్కారు. వారు బానిసలవడమే కాకుండా తోటి విద్యార్థిని కూడా ఆ మత్తు లోకి దించారు. ఆ తర్వాత ఆమెను కూడా వారిలాగే బానిసను చేశారు. చివరికి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ దారుణంలో భర్తకు భార్య సహకరించడం విశేషం. అయితే ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి.. తర్వాత డబ్బు డిమాండ్ చేయడం గమనార్హం. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతిలో చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చెందిన 22 సంవత్సరాల యువతీ నాలుగు సంవత్సరాల క్రితం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి కోర్సులో జాయిన్ అయ్యారు. కొంతకాలం క్రితం వరకు ఆమె కాలేజీలోని హాస్టల్లో ఉండేవారు. అదే సమయంలో తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామానికి చెందిన సదాశివం ప్రణవ కృష్ణ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. పైగా ఆమె సహ విద్యార్థిని కావడంతో తరచూ ఆ యువతి ఇంటికి వెళ్లి వచ్చేది. ఇదే సమయంలో ప్రణవకృష్ణ భర్త కృష్ణ కిషోర్ రెడ్డి తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. తిరుపతిలోని భాకరాపేటకు చెందిన కృష్ణ కిషోర్ రెడ్డి కూడా ఎస్వీయూ లా కాలేజీలో ఎల్ఎల్బీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

ప్రణవ కృష్ణ, కృష్ణ కిషోర్ దంపతులు హై ప్రోఫైల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవారు. ఇదే సమయంలో వారిద్దరూ గంజాయికి బానిసయ్యారు. అప్పుడప్పుడు వారి ఇంటికి వచ్చే ఆ యువతికి కూడా వారు గంజాయి రుచి చూపించారు.. మొదట్లో వద్దని వారించిన యువతికి బలవంతం చేసి గంజాయి తాగించేవారు. సిగరెట్ లో గంజాయి పొడిని నింపి ఆమెకు ఇచ్చేవారు. ఇలా ఆమెను గంజాయికి బానిసను చేశారు. ఒకసారి గంజాయి తాగిన మైకంలో ఉన్నప్పుడు కృష్ణ కిషోర్ రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆ దృశ్యాలను ప్రణవకృష్ణ తన ఫోన్ లో చిత్రీకరించింది. ఆ తర్వాత అదృశ్యాలను చూపించి ఆమెను బెదిరించింది. ఆమె మెడ పై ఉన్న బంగారు నగలను ప్రణవ కృష్ణ, కృష్ణ కిషోర్ రెడ్డి తీసుకున్నారు. అయినప్పటికీ డబ్బులను డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆ యువతి తను డబ్బులు ఇవ్వలేనని చెప్పినప్పటికీ వారు తమ వేధింపులను ఆపలేదు. ఈలోపు ఆ యువతికి వివాహం నిశ్చయమైంది. అయితే ఆ యువతి ఎంతకీ డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రణవకృష్ణ, కృష్ణ కిషోర్ రెడ్డి ఆ ఫోటోలను, వీడియోలను బాధిత యువతి సోదరుడు, ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. వారి ఆగడాలు మరింత పెరిగిపోతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఈనెల 25న తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ప్రస్తుతం కృష్ణ కిషోర్ రెడ్డి, ప్రణవ కృష్ణను ఎస్వియు నుంచి సస్పెండ్ చేశారు.

కాగా ఈ ఘటన తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించింది. న్యాయ విద్యను అభ్యసించే దంపతులు ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం కలకలం రేపింది. అయితే వీరిద్దరూ ఆ యువతిని మాత్రమే ట్రాప్ చేశారా? ఇంకా ఎవరినైనా ఆ ఊబిలోకి దింపారా? అనే కోణాలలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version