America: ఏ ముహూర్తంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడో తెలియదు గాని.. ఆ దేశానికి ఏది కూడా కలిసి రావడం లేదు. ఆంక్షలు.. సుంకాలు.. ప్రపంచ దేశాలను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడు ట్రంప్. ఒక రకంగా ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో చూపిస్తున్నాడు. వాస్తవానికి ట్రంప్ విధిస్తున్న సుంకాలవల్ల ప్రపంచ దేశాల కంటే అమెరికాకే నష్టం ఎక్కువగా జరుగుతోంది. ఈ విషయాన్ని ట్రంప్ గుర్తించడం లేదు. ఏమాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదు.
ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతోంది. అమెరికాలోని విపక్ష పార్టీల నేతలు కూడా ట్రంప్ తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమెరికాలో కీలక బిల్లుల విషయంలో విపక్ష పార్టీ నిరసన వ్యక్తం చేసింది. బిల్లుల విషయంలో అధికార పార్టీ తీసుకొచ్చిన విధానాలకు వ్యతిరేకంగా స్వరం వినిపించింది. దీంతో అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం షట్ డౌన్ అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నది. గడిచిన 31 రోజులుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. దీనివల్ల అమెరికాలో ఏకంగా 62,000 కోట్ల సంపద ఆవిరి అయిపోయింది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 11 బిలియన్ డాలర్ల సంపద ఆవిరి అయిపోతుందని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ పేర్కొంది. ఈ షట్ డౌన్ చాప కింద నీరు లాగా విస్తరిస్తోందని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా మారిపోవడం వల్లే ఇదంతా జరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇది ఊహించిన దానికంటే అతిపెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో 1981 నుంచి షట్ డౌన్ అనేది కొనసాగుతూ వస్తోంది. అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు 10 సార్లు మూతపడింది. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత 2018 -19 కాలంలో దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. అమెరికా దేశ చరిత్రలోనే అతిపెద్ద సుదీర్ఘమైన మూసివేత అని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం చట్టసభ సభ్యుల మధ్య ఏమాత్రం రాజ కుదరడం లేదు. ఈ ప్రకారం తీసుకుంటే గత రికార్డును ఈసారి చోటు చేసుకున్న షట్ డౌన్ బద్దలు కొడుతున్న అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే అమెరికా జాబ్ మార్కెట్ చాలా బలహీనంగా ఉంది. షట్ డౌన్ ప్రభావం జాబ్ మార్కెట్ మీద తీవ్రతగా అనిపిస్తోంది. ఆర్థిక విధానాలు ఏమాత్రం బాగోలేదు. పైగా రాజకీయంగా కూడా ట్రంప్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కంపెనీలు పెట్టుబడి పెట్టే విషయంలో ఆలోచిస్తున్నాయి. మిగతా కంపెనీలు కృత్రిమ మేధ, ఆటోమేషన్ మీద ఆధారపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఉద్యోగులకు నరకం చూపిస్తున్నాయి.