America: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2025, జనవరి 20న వైట్‌హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. ఈమేరు అధికారిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ట్రంప్ తన ప్రభుత్వంలో మంత్రులు, అధికారులను ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్‌తోపాటు, వలసల నిరోధంపై దృష్టిపెట్టారు. అధికారం చేపట్టిన మొదటి రోజే తీసుకునే చర్యలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ కమంలో టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈమేరకు తన లాయర్ల ద్వారా సుప్రీం కోర్టుకు విన్నవించారు. టిక్‌టాక్‌పై నిషేధం కేసులో మరింత సమయం కావాలని న్యాయవాదులు కోరారు. రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
చైనా యాప్..
చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్ వినియోగదారుల డేటా సేకరిస్తుందన్న ఆరోపణలతో దీనిని భారత్ సహా అనేక దేశాలు నిషేధించాయి. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉ న్న సమయంలో టిక్‌టాక్ నిషేధానికి ప్రయత్నాలు జరిగాయి. న్యాయపరమైన చిక్కులతో అమలు కాలేదు. అప్పట్లో ట్రంప్ టిక్‌టాక్ నిషేధానికి ప్రయత్నించారు. జాతీయ భద్రతకు టిక్‌టాక్ ముప్పుగా మారిందని కూడా ఆరోపించారు.
అనూహ్యంగా మారిన ట్రంప్ వైఖరి..
2018లో అధికారంలోకి వచ్చిన బైడెన్ ప్రభుత్వం కూడా టిక్‌టాక్‌పై నిసేధం కొనసాగించాలని నిర్ణయించింది. ఈమేరకు బిల్లు ప్రవేశపెట్టగా నిషేధానికి మద్దతుగా 352 ఓట్లు, వ్యతిరేకంగా 65 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు ఆమోదం పొందింది. నిషేధం అమలులోకి వచ్చింది. నాడు ట్రంప్ కూడా నిషేధానికి మద్దతు తెలిపారు. అయితే అనూహ్యంగా ట్రంప్ వైఖరి మారింది. ఆయనే టిక్‌టాక్ వాడడం మొదలు పెట్టారు. దీంతో యాప్ నిషేధంపై తన నిర్ణయం మార్చుకున్నట్లు ప్రకటించారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో టిక్‌టాక్‌పై మాట మార్చారు. అధికారంలోకి వస్తే టిక్‌టాక్‌ను నిషేధించబోమని తెలిపారు. చెప్పినట్లుగానే ఇప్పుడు సుప్రీం కోర్టుకు విన్నవించారు.