Homeఅంతర్జాతీయంAmerica Vs Iran: ఇరాన్ పై యుద్ధానికి రెడీ అయిన అమెరికా.. మోహరింపు

America Vs Iran: ఇరాన్ పై యుద్ధానికి రెడీ అయిన అమెరికా.. మోహరింపు

America Vs Iran: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. వెనెజెవెలా అధ్యక్షుడిని కిడ్నాప్‌ చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధ కాంక్షతో రగిలిపోతున్నాడు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో రగిలిపోతున్న ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఇరాన్‌కు పలుమార్లు వార్నింగ్‌ ఇచ్చాడు. ఇక ఇప్పుడు వార్‌కు రెడీ అవుతున్నాడు. ఆయుధాలు మోహరిస్తున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్‌ బలగాలను ఇరాక్‌ సరిహద్దుకు తరలించాడు. అమెరికా యుద్ధ విమానాలను రెడీ చేశాడు. తాజాగా అమెరికాకు చెందిన అబ్రహం లింకన్‌ వాహక నౌక ఇటీవల ఇక్కడికి చేరింది. దీనితో పాటు యూఎస్‌ఎస్‌ ఫ్రాంక్‌ ఈ. పీటర్సన్‌ జూనియర్, యూఎస్‌ఎస్‌ స్ప్రూయాన్స్‌ డెస్ట్రాయర్లు, యూఎస్‌ఎస్‌ మిషెల్‌ మార్ఫీ కూడా ఇరాన్‌కు తరలించాడు. యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ దీనిని నిర్ధారించింది. ప్రాంత స్థిరత్వం, భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఈ నౌబల బృందం ఆరబియా సముద్రం సరిహద్దుల్లో మాత్రమే కాక, హిందూ మహాసముద్రంలో కూడా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఫలితంగా, ప్రాంతంలో అమెరికా సైనికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

అదనపు యుద్ధ విమానాలు..
పెంటగాన్‌ ఇంకా ఎక్కువ ఫైటర్‌ జెట్‌లు, సైనిక కార్గో విమానాలను ఈ దిశలోకి తరలించే యోచనలో ఉంది. ఇరాన్‌లో పాలిటికల్‌ అస్థిరతలు, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో వేల మంది మరణించినట్లు అంచనా. ఆందోళనలకు మద్దతుగా నిలబడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ప్రభుత్వం ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటే జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. దీని ఫలితంగా భారీ సైనిక బలగాలను రెడీ చేస్తున్నామని ప్రకటించారు. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తాలను మరింత పెంచింది.

చర్చలకు సైతం సిద్ధం…
ఒకవైపు యుద్ధ విమానాలు, నౌకలను మోహరిస్తున్న అమెరికా.. మరోవైపు ఇరాన్‌ చర్చలకు ముందుకు వస్తే తాము సిద్ధమని అమెరికా అధికారి తెలిపారు. టెహ్రాన్‌కు చర్చలు సాగించేందుకు అవసరమైన అడుగులు ఇప్పటికే తెలుసని చెప్పారు. మొత్తంగా పశ్చిమాసియాలో మళ్లీ అలజడి మొదలైంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version