Homeజాతీయ వార్తలుPM Modi Praises Bhajan Clubbing: మోదీ నోట భజన్‌ క్లబ్బింగ్‌.. అసలు ఏంటిది?

PM Modi Praises Bhajan Clubbing: మోదీ నోట భజన్‌ క్లబ్బింగ్‌.. అసలు ఏంటిది?

PM Modi Praises Bhajan Clubbing: ప్రధాని నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత చేపట్టిన కొత్త కార్యక్రమాల్లో మన్‌కీబాత్‌ ఒకటి. రేడియో ద్వారా మారుమూల ప్రజలకు సైతం ఆయన సందేశాని పంతున్నాడు. ఇక ప్రతీ మన్‌కీబాద్‌తో ఒక కొత్త విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలను ఆయన పేర్కొన్నారు. తాజాగా అనంతపూర్‌ నీటి పొదపుపును ప్రశంసించారు. ఇదే సమయంలో జెన్‌ జెడ్‌ యువత చేస్తున్న ‘భజన్‌ క్లబ్బింగ్‌’ను ప్రస్తావించారు. దీంతో నెటిజన్లలో ఆసక్తి రేగింది. సంప్రదాయ భజనలు, కీర్తనలు, శ్లోకాలతో నైట్‌లైఫ్‌ను పునర్వ్యవస్థీకరించే ఈ ట్రెండ్, ఆధ్యాత్మికతను క్లబ్‌ కల్చర్‌తో ముడిపెడుతోంది.

ఇది కేవలం ట్రెండ్‌ కాదు.. మానసిక శాంతికి కొత్త మార్గం. లిక్కర్, స్మోకింగ్‌ లేని ఈ ఈవెంట్లు లైవ్‌ కాన్సర్ట్‌ల రూపంలో జరుగుతూ, యువతను ఆకర్షిస్తున్నాయి.

ఏంటీ భజన్‌ క్లబ్బింగ్‌..
పాశ్చాత్య క్లబ్‌ సంస్కృతిలో డీజేలు, లైటింగ్, డ్యాన్స్‌ ఫ్లోర్‌ ఉంటే,ఈ భజన్‌ క్లబ్బింగ్‌లో భక్తి సంగీతం, మాండలిన్, టేబులా లాంటి సంగీత వాద్యాలు కీలకం. రాత్రి సమయంలో జరిగే ఈ కార్యక్రమాలు యువతకు ఒత్తిడి నివారణగా మారాయి. పోస్ట్‌–కోవిడ్‌లో మానసిక ఆరోగ్య సమస్యలు పెరగడంతో ఇది ట్రెండ్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ వీడియోలు దీన్ని ప్రపంచవ్యాప్తం చేశాయి. భారతదేశంలో హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ ఈవెంట్లు జనాదరణ పొందుతున్నాయి.

యువతపై ప్రభావం..
ఈ ట్రెండ్‌ యువతలో మానసిక స్థిరత్వాన్ని పెంచుతోంది. స్టడీల ప్రకారం, భజనలు ఆనంద హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే, సాంకేతికత దూరంగా ఉంచి సామూహిక భక్తిని ప్రోత్సహిస్తోంది. సాంస్కృతికంగా, ఇది భారతీయ విలువలను ఆధునిక యువకులకు అనుకూలంగా చేస్తోంది. పాశ్చాత్య ప్రభావాల మధ్య స్వదేశీ ఆధ్యాత్మికతను పునరుజ్జీవనం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మోదీ ప్రస్తావన దీన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది.

అయితే, వాణిజ్యీకరణతో భక్తి స్పృహ క్షీణించే ప్రమాదం ఉంది. కొన్ని ఈవెంట్లు టికెట్‌ ధరలు ఎక్కువ చేసి డబ్బు సంపాదనపై దృష్టి పెడుతున్నాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు దీన్ని సమాజకార్యాలతో ముడిపెట్టాలి. భవిష్యత్తులో ఈ ట్రెండ్‌ గ్లోబల్‌ స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. భారతదేశం యోగా, మెడిటేషన్‌తోపాటు భజన్‌ క్లబ్బింగ్‌ను ‘సాఫ్ట్‌ పవర్‌’గా ప్రపంచానికి అందించవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version