Peddi Movie Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ లాంటి హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు భారీ విజయాలను అందుకుంటూ తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాయి. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ l పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఇక మూడు రోజుల క్రితం ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి ఆదరణ సంపాదించడమే కాకుండా ఆయన కంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇక గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి గ్లింప్స్ అయితే రిలీజ్ అయ్యాయి…మరి ఈ గ్లింప్స్ అద్భుతంగా ఉండటమే కాకుండా చూసిన ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తుంది.
Also Read: ‘పెద్ది’ టీజర్ వచ్చేసింది..ఫస్ట్ షాట్ సిక్సర్..లాస్ట్ షాట్ అరాచకం!
రామ్ చరణ్ మాస్ లుక్ లో ప్రేక్షకులను అలరించాడు. ప్రతి షాట్ కూడా అద్భుతంగా ఉండటమే కాకుండా ప్రతి షాట్ కి జస్టిఫికేషన్ ఇస్తూ దర్శకుడు ఒక డీసెంట్గ్లింప్స్ ను అయితే ప్రేక్షకుల ముందుకు వదిలారు. రామ్ చరణ్ చేతిలో కర్ర పట్టుకుని వస్తూ ఉంటే ఆ కర్రకు త్రెడ్ దానికదే చుట్టుకునే షాట్ హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. ఆయన బ్యాట్ పట్టుకొని ఫ్రెండ్లీ కి వచ్చి కొట్టే షాట్ నిజంగా నెక్స్ట్ లెవల్లో ఉంది. అయితే అంత బాగానే ఉంది కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ ను చూస్తే రంగస్థలం లో రామ్ చరణ్ ను చూసినట్టుగానే ఉంది. లుక్ లో గానీ షాట్స్ లో గానీ తెలియకుండానే బుచ్చిబాబు సుకుమార్ స్టైల్ ను ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది…
ఇక రామ్ చరణ్ ఈ సినిమాతో సత్తా చాటుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రమే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇప్పటి వరకు చాలా మంది చాలా సినిమాలు చేసినప్పటికి పెద్ది సినిమా మీద మాత్రం చాలా బజ్ అయితే క్రియేట్ అవుతుంది.
ఇక రామ్ చరణ్ ను సుకుమార్ ఒక రేంజ్ లో చూపిస్తే బుచ్చిబాబు కూడా డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు…చూడాలి మరి ఈ సినిమా మొత్తం రంగస్థలం ఫ్లేవర్ లోనే ఉంటుందా లేదంటే కొత్తగా ఏదైనా చూపించబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఒక్క సినిమా తీసిన బుచ్చిబాబు కి రామ్ చరణ్ అవకాశం ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…మరి ఈ సినిమాతో బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ గా మారిపోతాడా లేదా అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…
