Hezbollah : పశ్చిమసియాలోని లెబనాన్ ప్రాంతంలో హెజ్ బొల్లా చీఫ్ నస్రల్లా ను ఇజ్రాయిల్ దళాలు చంపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెజ్ బొల్లా అడుగులు ఎటువైపు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. తనకంటే ఎన్నో రెట్ల బలమైన ఇజ్రాయిల్ ను ఎలా దెబ్బతిస్తుందనేది ఉత్కంఠ గా మారింది. ఇజ్రాయిల్ తన గూడ చర్య సంస్థ మోస్సాద్ ద్వారా హెజ్ బొల్లా గ్రూప్ కు చెందిన కీలక నాయకులను హతమార్చింది. అయినప్పటికీ హెజ్ బొల్లా గ్రూప్ దగ్గర విపరీతమైన ఆయుధాలు ఉన్నాయి. క్షిపణులు, రాకెట్లు, శిక్షణ పొందిన వేలాదిమంది ఫైటర్లున్నారు. నస్రల్లా హతమైన తర్వాత ఇజ్రాయిల్ పైకి హెజ్ బొల్లా కొద్ది మొత్తంలోనే రాకెట్లను ప్రయోగిస్తోంది. అయితే అదును చూసి భారీ స్థాయిలో రాకెట్లను ప్రయోగించేందుకు హెజ్ బొల్లా సిద్ధమవుతుందని అంతర్జాతీయ నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇజ్రాయిల్ కూడా అదే స్థాయిలో స్పందిస్తే అక్కడ వాతావరణం వేరే విధంగా ఉంటుంది.
అంత సులభం కాదు
నస్రల్లా ను హతమార్చిన ఇజ్రాయిల్ కు హెజ్ బొల్లా ను సమూలంగా తుద ముట్టించడం అంత సులభం కాదు. 1978 నుంచి పలుమార్లు లెబనాన్ పై దాడులు చేసింది. దిగ్బందించింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సంవత్సరంగా హమాస్ పై పోరు కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయిల్ ఆశించినంత ఫలితం మాత్రం రావడం లేదు. అయితే ఇజ్రాయిల్ ఎదురుగా వచ్చే సైన్యంతో పోరాడొచ్చు. హెజ్ బొల్లా, హమాస్ లాంటి గెరిల్లా దళాలతో పోరాటం చేయడం అంత సులభం కాదు. విజయం దక్కడం అంత సులువు కాదు.
ఇరాన్ అండదండలతో..
హెజ్ బొల్లా, హమాస్, హౌతీ వంటి గ్రూపులకు ఇరాన్ ఒక షెల్టర్ గా ఉంది. నష్ట పరిస్థితుల్లో ఇజ్రాయిల్ పై పూర్తిస్థాయిలో యుద్ధం చేసేందుకు ఇరాన్ అంత శుభకంగా లేదు. ఇజ్రాయిల్ తో ఇరాన్ దేశానికి భౌగోళికంగా సరిహద్దులు లేవు. గతంలో ఇజ్రాయిల్ పైకి ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అయితే వాటిని అమెరికా సహాయంతో ఇజ్రాయిల్ కూల్చివేసింది. ఒకవేళ ఇరాన్ కనుక పోరులోకి దిగితే ఇజ్రాయిల్ అణు ఆయుధాలను బయటికి తీసే ప్రమాదం లేకపోలేదని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే అటువంటి ఆయుధాలు తమ బుద్ధ లేవని ఇజ్రాయిల్ చెబుతున్నప్పటికీ.. అవి నమ్మశక్యమైన మాటలు కావని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. అయితే భౌగోళికంగా సరిహద్దులు లేకపోవడం వల్ల రెండు దేశాలు యుద్ధం చేయకపోవచ్చు అని తెలుస్తోంది.
హెజ్ బొల్లా ను ఏం చేస్తుందో?
ఇజ్రాయిల్ వేమానికి దాడులతో మంచి ఫలితాలను రాబట్టింది. హెజ్ బొల్లా స్థావరాలను నేలమట్టం చేసింది. ఇదే ఊపులో ఇజ్రాయిల్ మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 2006లో ఇలాంటి ప్రయత్నాన్ని ఇజ్రాయిల్ చేసింది. అది అప్పట్లో ఇజ్రాయిల్ దేశానికి ఇబ్బందికరంగా మారింది. అందువల్లే సరిహద్దుల వద్ద మోహరించడం వరకే ఇజ్రాయిల్ పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.