IPL 2025 : ఆర్టీఎం కార్డు అంటే ఏమిటి? బీసీసీఐ అప్పుడు పక్కనపెట్టి.. ఇప్పుడు ఎందుకు తెరపైకి తెచ్చింది?

ఐపీఎల్ -2025 ను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. గతానికంటే భిన్నంగా ఆదాయాన్ని సంపాదించుకోవాలని భావిస్తోంది. క్రికెట్ చరిత్రలోనే ఐపీఎల్ ను మరింత క్రికెట్ రిచ్ లీగ్ గా రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 29, 2024 10:37 pm
Follow us on

IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి మెగా వేలం నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన నిబంధనలను ఇప్పటికే పూర్తి చేసింది. ఆయా జట్ల యాజమాన్యాలతో ఫలు దఫాలుగా చర్చలు నిర్వహించి.. వాటిని అమలు చేస్తామని ప్రకటించింది.. ఆదివారం బెంగళూరులోని 4 సీజన్స్ హోటల్ లో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. అయితే 2022లో పక్కన పెట్టిన రైట్ టు మ్యాచ్ ను ఈసారి మాత్రం వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ నిబంధన వల్ల ఆటగాళ్లు నష్టపోతున్నారని గతంలో రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. దీంతో బిసిసిఐ ఈసారి ఈ నిబంధనను పూర్తిగా మార్చింది. ఆటగాళ్లకు లాభం కలిగే విధంగా ఆర్టీఎం నిబంధన లో కాస్త ట్విస్ట్ ఇచ్చింది. మెగా వేలానికి సంబంధించి వదిలేసిన తమ ఆటగాళ్ల నుంచి జట్లు ఆర్టీఎం హార్డ్ ద్వారా ఒకరిని తిరిగి కొనుగోలు చేసుకోవచ్చు.. అయితే గతంలో ఈ నిబంధన మరో విధంగా ఉండేది. ప్రత్యర్థి జట్టు ఎంతకైతే బిడ్ వేస్తుందో.. అంతే ధరను చెల్లించి.. కొనుగోలు చేసేది.. అయితే బిసిసిఐ ఈసారి ఈ నిబంధనను పూర్తిగా మార్చింది. బిడ్ వేసిన జట్టుకు మరో ఆటగాడిని తీసుకోవడానికి ఇంకో అవకాశం ఇచ్చేది. మరోసారి బిడ్ వేసే అవకాశాన్ని కూడా ఇచ్చింది. అప్పుడు ఆ ధరను చెల్లిస్తే ఆర్టీఎం కింద తమ ఆటగాడిని ఫ్రాంచైజీ జట్టు తీసుకోవచ్చు.. ఉదాహరణకి హైదరాబాద్ జట్టు ట్రావిడ్ హెడ్ ను వేలంలో వదిలేసింది అనుకున్నాం అతని కోసం బెంగళూరు జట్టు వేలంలో 12 కోట్ల వరకు బిడ్ వేసి దక్కించుకుంది అనుకుందాం. అప్పుడు హైదరాబాద్ జట్టు ఆర్టీఎం కార్డు ద్వారా హెడ్ ను తీసుకోవాలనుకుంది అనుకుందాం. పాత నిబంధన ప్రకారం పన్నెండు కోట్లు చెల్లించి అతడిని తీసుకోవచ్చు. అదే కొత్త నిబంధన ప్రకారం బెంగళూరు మరోసారి బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు బెంగళూరు 13 కోట్లకు బిడ్ దాఖలు చేస్తే.. హైదరాబాద్ ఆ డబ్బులను చెల్లించి హెడ్ ను తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే హెడ్ బెంగళూరు వైపు వెళ్ళిపోతాడు.

ఆదాయం అదరహో

ఇక ఈసారి అన్ని లీగ్ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్ కు 7.50 లక్షలు చెల్లించనుంది. ఫలితంగా ఆటగాళ్లకు అదనంగా 1.05 కోట్ల ఆదాయం దక్కుతుంది. దీనికోసం ప్రతి జట్టు 12.60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని శనివారం ట్విట్టర్ వేదికగా బిసిసిఐ సెక్రటరీ జై షా ప్రకటించారు. ఇది పర్స్ విలువకు అదనం.. అంతేకాదు రిటైన్ చేసుకునే ప్లేయర్లకు వరుసగా 18, 14, 11 కోట్లు ఇవ్వాలి.. నాలుగు, ఐదవ ప్లేయర్ ను తీసుకోవాలనుకుంటే తిరిగి 18, 14 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే 45 కోట్లు మాత్రమే ఖాతాలో మిగులుతాయి. ఆ డబ్బుతోనే ఆర్టీఎం, 15 మంది ప్లేయర్లను కొనుగోలు చేయాలి. కాగా, 2022లో ఆర్టీఎం కార్డును పక్కనపెట్టిన బీసీసీఐ.. ఈసారి మాత్రం అనుమతి ఇవ్వడం విశేషం.