Iran New President: ఇరాన్ కొత్త అధ్యక్షుడు అతనే..!

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షులుగా నియామకమైన ముఖ్బారే కీలక సవాళ్లనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో మొదటగా ఆయన ఇరాన్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ రైసి మృతికి గల కారణాలపై విచారణను వేగవంతం చేయాల్సి ఉంటుంది.

Written By: Neelambaram, Updated On : May 20, 2024 3:52 pm

Iran New President

Follow us on

Iran New President: ఇరాన్ లో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో..శత్రు దేశాలు ఇరాన్ లో అస్థిర రాజకీయ పరిస్థితులను ఏర్పర్చేందుకు అవకాశం ఇవ్వకుండా..ఆదేశం అధ్యక్షుడి ఎంపికలో వేగంగా నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ముహ్మద్ ముఖ్బార్ కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మునుముందు ముఖ్బారే ఇరాన్ ప్రెసిడెంట్గా కూడా అలాగే కంటిన్యూ అవకాశం ఉంది. ముఖ్బారే అధ్యక్ష పదవికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేనీ ఆమోద ముద్ర వేయనున్నారు.

ఇక ఇరాన్ తాత్కాలిక అధ్యక్షులుగా నియామకమైన ముఖ్బారే కీలక సవాళ్లనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో మొదటగా ఆయన ఇరాన్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ రైసి మృతికి గల కారణాలపై విచారణను వేగవంతం చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇరాన్ కు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న హౌతి రెబల్స్, యెమెన్ తిరుగుబాటు దారులు, హమాస్ లకు ఆయన రైసీ మాదిరే సంపూర్ణ సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. వీటితో పాటు లెబనాన్ లోని ఇరాన్ మద్దతుదారులకు కూడా ఆర్థికపరమైన సపోర్టునివ్వాల్సి ఉంటుంది.

రైస్ మృతిలో ఇజ్రాయిల్, అమెరికా,టర్కీ పాత్ర ఏమైనా ఉందా..? లేదా..? అనే వ్యవహారాన్ని తెల్చేందుకు ఆయన ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తికర అంశంగా మారింది. ఇక పాలస్తినా,గాజా పట్టిలో ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దాడులను నిలువరించడంలో
ముఖ్బారే పనితనం ఏంటనేది తేలాల్సి వుంది.