https://oktelugu.com/

Geoffrey Hinton: AI వాడకంపై జెఫ్రీ హింటన్ సంచలన హెచ్చరిక..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడ్యూసింగ్, ఎకానమీని పెంచుతుందని, కానీ ఆ డబ్బు సంపన్నులకు వెళ్తుందని, ఉద్యోగాలు కోల్పోయే వ్యక్తులకు కాదని, అది సమాజానికి చాలా చెడును చేస్తుందని గతేడాది గూగుల్ లో పనిచేసిన హింటన్ అన్నారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : May 20, 2024 / 03:44 PM IST

    Geoffrey Hinton

    Follow us on

    Geoffrey Hinton: ప్రస్తుతం ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ (AI)వైపు ఎక్కువగా మొగ్గుచూపుతోంది. దీంతో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉండడంతో ఏఐ గాడ్ ఫాదర్ గా పరిగణించబడుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాధారణ ఉద్యోగాలు కోల్పోవడంలో ప్రముఖ పాత్ర పోషించిందని తాను చాలా ఆందోళన చెందుతున్నానని, ఆదాయ అసమానతలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఆయా దేశాల ప్రభుత్వాలపై ఉంటుందని జెఫ్రీ హింటన్ అన్నారు.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడ్యూసింగ్, ఎకానమీని పెంచుతుందని, కానీ ఆ డబ్బు సంపన్నులకు వెళ్తుందని, ఉద్యోగాలు కోల్పోయే వ్యక్తులకు కాదని, అది సమాజానికి చాలా చెడును చేస్తుందని గతేడాది గూగుల్ లో పనిచేసిన హింటన్ అన్నారు. ప్రభుత్వం యూనివర్సల్ బేసిక్ ఇంకమ్ ఏర్పాటు చేయాలి.. అంటే ప్రభుత్వం వ్యక్తులందరికీ వారి వనరులతో సంబంధం లేకుండా నిర్ధిష్ట మూల వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

    ‘డౌనింగ్ స్ట్రీట్ లోని ప్రజలు నన్ను సంప్రదించారు, సార్వత్రిక ప్రాథమిక ఆదాయం మంచి ఆలోచన అని నేను వారికి సలహా ఇచ్చాను’ ఏఐ ప్రమాదాల గురించి మరింత స్వేచ్ఛగా మాట్లాడాలని బీబీసీతో హింటన్ అన్నారు.

    ఏఐ చాట్ బోట్ల గురించి ఆయన మరింత ఆందోళన చెందారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్లు ‘చాలా భయానకంగా’ ఉన్నాయని హింటన్ గతంలో కూడా హెచ్చరించారు. చాట్ బోట్లు మానవుల కంటే ఎక్కువ తెలివైనవి కాగలవని చెడ్డ వ్యక్తులు వీటిని ఉపయోగించుకుంటే మరింత ప్రమాదం సంభవిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ‘తనను తాను కావలసిన విధంగా అభివృద్ధి చెందగలదు’, స్వయం ప్రతిపత్తితో ‘నియంత్రణను పొందే లక్ష్యాన్ని అభివృద్ధి చేయగలదు’ అని హింటన్ చెప్పారు.

    సైన్యంలో ఏఐ వద్దు..
    మరో 5 నుంచి 20 ఏళ్లలో కృత్రిమ మేధ (ఏఐ) భారీ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని హింటన్ హెచ్చరించారు. ఇది మానవులు అంతరించిపోయే ముప్పును తెస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ‘జీవ మేధస్సు కంటే ఏఐ మిషన్లు తెలివైనవి మారవచ్చు.. నేను చాలా ఆందోళన చెందుతుంది ఏంటంటే, ఇవి ప్రజలను చంపేందుకు స్వయం ప్రతిపత్తితో నిర్ణయం తీసుకోగలవు’ అని ఆయన అన్నారు. ఏఐ మిషన్లను సైన్యంలో వాడడంపై ప్రపంచం మొత్తం నిషేధం విధించాలని సూచనలు చేశారు.