Afghanistan: యుద్ధం చేసే సత్తా ఉండదు. సైనికులకు సామర్ధ్యం ఉండదు. ప్రభుత్వం దగ్గర దమ్ము ఉండదు. అంతర్జాతీయంగా పలుకుబడి ఉండదు. దేశం ఏకతాటి మీద ఉండదు. ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతాయో తెలియదు. ఉగ్రవాదులు ఎవరిని చంపేస్తారో తెలియదు. స్థూలంగా చూస్తే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు. అటువంటి దేశమే పాకిస్తాన్. అయినప్పటికీ ఆ దేశం మీసాలు దువ్వుతుంది. తొడలు కొడుతుంది. ఉగ్రవాదులకు భయపడుతూ బతుకుతూ.. పైకి మాత్రం తనకు తాను సూపర్ పవర్ గా ఉన్నానని అభివర్ణించుకుంటుంది.
పైకి ఎంతటి గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ పాకిస్తాన్ కు క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదు. పైగా పాకిస్తాన్ చేసే పనులు మొత్తం అత్యంత దరిద్రంగా ఉంటాయి.. భారత్ ను నేరుగా ఢీకొట్టే సత్తా లేక పహల్గంలో మారణకాండ కు పాల్పడింది. ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపడితే తోక ముడిచింది. ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తే కన్నీరు కార్చింది. అమెరికా దగ్గరికి వెళ్లి.. చేతులు జోడించి నమస్కరించింది. భారత్ అనే విధాలుగా దాడులు చేస్తే నష్టపోయి.. మూసుకొని కూర్చుంది.
ఆఫ్గనిస్తాన్ తో కూడా పాకిస్తాన్ ఇలానే గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నది. ఆఫ్ఘనిస్తాన్ తిరిగి దాడి చేస్తుంటే కాల్పుల విరమణ అంటూ నాటకం ఆడుతోంది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే మళ్లీ కాల్పులకు పాల్పడుతుంది. చివరికి వైమానిక దాడులకు కూడా వెనుకాడటం లేదు. ఎవరెవరికి పాకిస్తాన్ చేసిన వైమానిక దాడుల వల్ల ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన యువ క్రికెటర్లు కబీర్ ఆఘా, సిబ్ గతుల్లా, హారూన్ దుర్మరణం పాలయ్యారు. స్నేహపూర్వక మ్యాచ్ ఆడేందుకు వారు షార్నా అనే ప్రాంతానికి వెళ్లారు.. ఆ తర్వాత ఉరుగన్ లో ఉన్న తమ ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వారిని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైనికులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు క్రికెటర్లతో పాటు ప్రజలు కూడా చనిపోయారు. ముగ్గురు క్రికెటర్లు చనిపోయిన నేపథ్యంలో వారి అంత్యక్రియలకు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు భారీగా హాజరయ్యారు. లక్షల మంది అంత్యక్రియలలో పాల్గొని పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దేశానికి తగిన పాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి.
పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లను హతమార్చడం పట్ల అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఏకాకిని చేయాలని.. క్రికెట్లో హింసకు తావు లేదని.. ఇలా వర్ధమాన ప్లేయర్లను చంపడం ద్వారా పాకిస్తాన్ అసలు ముఖచిత్రం ప్రపంచానికి తెలిసిందని భారత క్రికెటర్ నియంత్రణ మండలి చెబుతోంది.
Afghanistan: Thousands gathered in Paktika province to pay last respects to Afghan cricketers killed in Pakistan’s cross border military strikes.pic.twitter.com/7mITGypI2n
— Sidhant Sibal (@sidhant) October 18, 2025