K Ramp Movie Collection Day 1: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘K ర్యాంప్'(K Ramp Movie) నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. దిల్ రూబ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత కిరణ్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అసలు అంచనాలు ఉండేవి కాదు. పైగా ట్రైలర్ ని చూస్తే క్రింజ్ జోకులు ఉన్నాయి కాబట్టి, అసలు వర్కౌట్ అవ్వడాన్ని అనుకున్నారు. రివ్యూయర్స్ కూడా ఈ చిత్రానికి దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. కానీ సినిమా ఆడియన్స్ కి ఒక మోస్తారు గా నచ్చింది. కామెడీ ని ఎంజాయ్ చేశారు. మౌత్ టాక్ పాజిటివ్ గా బాగా వ్యాప్తి చెందడం తో ఓపెనింగ్ వసూళ్లు పుంజుకున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ షోస్ నుండి వసూళ్లు అన్ని ప్రాంతాల్లో బాగా ఊపందుకుంది. ఫలితంగా మంచి ఓపెనింగ్స్ ని సాధించిన సినిమాగా కిరణ్ అబ్బవరం కెరీర్ లో నిల్చింది ఈ చిత్రం.
ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈ చిత్రానికి ఓవర్సీస్ లో కూడా డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. కేవలం ప్రీమియర్స్ నుండి ఈ చిత్రానికి లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కిరణ్ అబ్బవరం రేంజ్ కి ఇది చాలా పెద్ద ఓపెనింగ్ అనుకోవచ్చు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండి కోటి 40 లక్షల నుండి కోటి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. గ్రాస్ మూడు కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందట. ఒక సినిమాకు ఆడియన్స్ లో పాజిటివ్ మౌత్ టాక్ ఉంటే, రివ్యూస్ ఎంత చెత్తగా ఉన్నా, ఆడియన్స్ ఆదరిస్తారు అనడానికి K ర్యాంప్ మరో ఉదాహరణగా నిల్చింది. సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా తక్కువకి చేశారట.
ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి కేవలం 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగిందట. ఇది చాలా తక్కువ అవ్వడం తో వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. దీపావళి పండుగ రోజు, సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకొని లాభాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. భారీ ఫ్లాప్ తర్వాత కిరణ్ అబ్బవరం కి ఈ చిత్రం బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.