Karnataka(1)
Karnataka: ఎన్నికల్లో గెలవడానికి, అధికారంలోకి రావడానికి పార్టీలు, నాయకులు అనేక హామీలు ఇస్తుంటారు. ఇందులో ఇప్పుడు ప్రధాన హామీగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఐదేళ్ల క్రితం ఢిల్లీలోని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీపార్టీ ఈ హామీని తెరపైకి తెచ్చింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత.. మూడేళ్ల క్రితం తమిళనాడు ఎన్నికల్లోనూ ఇదే హామీతో డీఎంకే కూడా అధికారంలోకి వచ్చింది. దీంతో జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ఈ హామీని అందుకుంది కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో మేనిఫెస్టోలో చేర్చింది. ఇక ఈ ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి కూడా ఇదే హామీతో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోంది. అయితే ఇప్పుడు కర్ణాటక మహిళలు ఈ ఫ్రీ బస్సు మాకొద్దని కోరుతున్నారు. ఫ్రీ బస్సు కారణంగా కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ నష్టాల్లో కూరుకుపోతోంది. దీంతో ఆర్టీసీ చార్జీలు 15 శాతం పెంచాలని సంస్థ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన సార్వత్రిక ఎన్నికలకు ముందు చేసినా.. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నాలుగు రోజుల క్రితమే 15 శాతం చార్జీలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో బస్సు చార్జీలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పడు కన్నడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మహిళల ఉచిత బస్సు ప్రభావంతోనే చార్జీలు పెరిగాయన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది.
పురుషులపై భారం..
ఫ్రీ బస్ పథకం కర్ణాటక ప్రభుత్వానికి భారంగా మారింది. దీంతో ఆర్టీసీ చార్జీలు పెంచాలని నిర్ణయించింది. నెలకు రూ.400 కోట్లు ఖర్చవుతుండడంతో ఆ భారం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఏడాదిన్నరపాటు భరించిన ప్రభుత్వం ఇప్పుడు చార్జీలు పెంచాలని నిర్ణయించింది. ఆ భారం పురుషులపై వేయడానికి సిద్ధమైంది. నాలుగు రోజుల క్రితం ప్రయాణ చార్జీలు 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రోజుకు రూ.8 కోట్ల ఆదాయం వస్తుందని ఆర్టీసీ అంచనా వేసింది. ఈమేరకు అమలు ప్రారంభించింది.
ప్రీ బస్ వద్దంటూ..
చార్జీలు పెంచిన నేపథ్యంలో కర్ణాటక మహిళలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. పురుషులు తమ కుటుంబ సభ్యులే అని పెంచిన చార్జీలతో తమ కుటుంబాలపై భారం పడుతుందని మహిళలు పేర్కొంటున్నారు. చార్జీలు పెంచవద్దని, అవసరమైతే తమ ఉచిత బస్సు ప్రయాణం కూడా రద్దు చేసుకోవాలని కోరుతున్నారు. ఇక ఫ్రీ బస్సు కారణంగా బస్సులు కూడా ఓవర్‌లోడ్ కారణంగా తరచూ మరమ్మతులకు వస్తున్నాయి. ఇది కూడా ప్రభుత్వానికి భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే చార్జీలు పెంచింది. అయితే చార్జీలు తగ్గించాలంటే.. మహిళల ప్రీబస్సు రద్దు చేయాలన్న డిమాండ్ కన్నడ ప్రజల నుంచి వస్తోంది.
సిద్ధరామయ్య ఏం చేస్తారో..
కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిరసనలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో సిద్ధరామయ్య సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది. ఉచిత బస్సు రద్దు చేస్తుందా.. లేక ఏవైనా సరవణలు చేస్తుందా.. చార్జీలు మినిమంగా వసూలు చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Karnataka women want to cancel free bus
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com