Tesla: ఈవీఎంల గురించి మాట్లాడితే ఫర్వాలేదు.. ఈవీల సంగతేంటి?… భారత ఈవీఎంల గురించి మాట్లాడిన ఎలోన్ మస్క్‌కి ఇప్పుడు తన సొంత ఎలక్ట్రిక్ వాహనాల నుంచి షాక్ తగిలిందా? టెస్లా ఈవీ పరిశ్రమలో విప్లవం తెచ్చిన బ్రాండ్‌గా పరిగణిస్తుంటారు. ప్రస్తుతం, ఈ కంపెనీ సాంకేతిక లోపాలు, భద్రతా సమస్యల కారణంగా తరచూ వివాదాల్లో నిలుస్తోంది. ఎలాన్ మస్క్ నాయకత్వంలో టెస్లా దాని హైటెక్ టెక్నాలజీ, సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ల ఆధారంగా గ్లోబల్ మార్కెట్‌లో భారీ వాటాను పొందింది. కానీ ఇటీవలి ప్రమాదాలు, సాంకేతిక లోపాలు దాని బ్రాండ్ ఇమేజ్‌పై అనేక ప్రశ్నలను లేవనెత్తాయి.
ఎలోన్ మస్క్ 2026 నాటికి స్టీరింగ్, పెడల్స్ లేకుండా పూర్తిగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. కానీ, ప్రస్తుత టెస్లా వాహనాల్లో ఎదురవుతున్న సమస్యలు ఈ వాగ్దానాల విశ్వసనీయతపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీలో సెన్సార్లు, కెమెరాలు లేకపోవడంపై ఫిర్యాదులు తరచుగా వస్తున్నాయి. వాహనాలు ఎరుపు, ఆకుపచ్చ లైట్లు వెలగడాన్ని గుర్తించకపోవడం, అకస్మాత్తుగా బ్రేకర్లను గుర్తించలేకపోవడం వంటి సంఘటనలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
ఛార్జింగ్ సమయంలో పేలుడు, మంటలు
రోడ్డు ప్రమాదాలే కాదు, టెస్లా వాహనాల బ్యాటరీలకు సంబంధించి కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో వాహనాలు పేలిపోయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల టెస్లా వాహనం ఛార్జింగ్‌లో పేలడంతో వాహనంతో పాటు ఇంటిని ధ్వంసం చేసిన ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలు ఛార్జింగ్ ప్రక్రియ, బ్యాటరీ భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తాయి.
టెస్లా ప్రజాదరణ, వివాదాల ప్రభావం
టెస్లా వాహనాలు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందాయి. గ్లోబల్ మార్కెట్‌లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా అమెరికాలో ఇది ఎన్నారైల అభిమాన కారుగా మారింది. కానీ, దానికి సంబంధించిన ప్రమాదాలు, ఛార్జింగ్ సంబంధిత సమస్యలు దాని బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. టెస్లా వాహనాలు రెండు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటాయి. ఒకటి మాన్యువల్, మరొకటి ఆటో మోడ్ స్టీరింగ్. ఆటో మోడ్‌లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని కారణంగా భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టెస్లా క్రేజ్‌కు తెరపడుతుందా?
టెస్లా అధునాతన సాంకేతికత, విస్తృతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్ ఉన్నప్పటికీ, ఇటీవలి వివాదాలు దాని వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నాయి. టెస్లాను కొనుగోలు చేసే ముందు, వినియోగదారులు దాని ఫీచర్లను, దాని వల్ల ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించాలని నిపుణులు భావిస్తున్నారు. బ్యాటరీ, ఛార్జింగ్‌కు సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Tesla sensor problem in charging exploding batteries will tesla craze close
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com