Kim Jong Un: నియంత అనగానే ప్రంపంచంలో అందరికీ గుర్తొచేది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. మానవత్వం లేకుండా ఏ విషయంలో అయినా కఠినంగా వ్యవహరిస్తాడు. దయ ఆయనలో మచ్చుకైనా కానరాదు. ఇక కిమ్ నవ్వడం కూడా అరుదు. ఆయన ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ కనిపించవు. అలాంటి నియంత తొలిసారి కంటతడి పెట్టుకున్నారు. ఈ దృశ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న ఉత్తర కొరియా సైనికుల మరణాలు ఆయనను తీవ్ర భావోద్వేగానికి గురిచేశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రష్యా, ఉక్రెయిన్ మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న సంఘర్షణలో ఉత్తర కొరియా తన స్నేహిత దేశమైన రష్యాకు మద్దతుగా సైనికులను పంపింది. ఈ సైనికులు రష్యా తరపున యుద్ధంలో పాల్గొన్నారు, కానీ వీరిలో వందలాది మంది యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను రష్యన్ విమానాల ద్వారా ఉత్తర కొరియాకు తిరిగి పంపింది. అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ అసాధారణ రీతిలో భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మోకాళ్లపై కూర్చొని, యుద్ధంలో మరణించిన సైనికుల ఫొటోలపై పతకాలను ఉంచి, బోరున విలపించారు. ఓ అమరవీరుడి కుమార్తె నుదిటిపై ముద్దు పెట్టుకుని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న సైనికులను, ప్రజలను కూడా భావోద్వేగపరిచింది. కిమ్ యొక్క ఈ అరుదైన మానవీయ కోణం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
రష్యాతో స్నేహ బంధం..
కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య స్నేహం గత కొన్నేళ్లుగా బలపడుతోంది. ఈ యుద్ధంలో రష్యాకు సైనిక మద్దతు ఇవ్వడం ద్వారా కిమ్ తన నిబద్ధతను చాటుకున్నారు. వేలాది మంది సైనికులను రష్యా తరపున యుద్ధానికి పంపడం, వారి బలిదానాన్ని గౌరవించడం ఈ స్నేహ బంధం లోతును సూచిస్తుంది. అమరవీరులకు నివాళులు అర్పించడంతోపాటు, కిమ్ జోంగ్ ఉన్ యుద్ధంలో పాల్గొన్న సైనికుల ధైర్యసాహసాలను కూడా ప్రశంసించారు.
#NorthKorean leader #KimJongUn led an emotional ceremony in #Pyongyang to honor soldiers killed fighting for #Russia in #Ukraine. pic.twitter.com/hX3h3ohWMt
— ShanghaiEyeofficial (@ShanghaiEye) August 22, 2025