https://oktelugu.com/

Italy: ఎంత సంపాదిస్తే ఏం లాభం.. ప్రకృతి ప్రకోపానికి ఈ మిలయనీర్, ఆయన కూతురు పరిస్థితి దారుణం

ఇటీవల మనం విమాన, హెలిక్యాప్టర్‌ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆకాశ మార్గాల్లో ప్రమాదాలకు వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలు ప్రధాన కారణమవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రయాణికులు, సిబ్బంది మృత్యువాత పడుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 23, 2024 / 01:10 PM IST

    Italy

    Follow us on

    Italy: రవాణా మార్గాల్లో ప్రపంచ వ్యాప్తంగా రైలు, రోడ్డు ప్రయాణాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. తర్వాత విమాన ప్రయాణ ప్రయాణానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. ఇక నదీ ప్రయాణం చేసేవారు చాలా తక్కువ. ఇతర మార్గాలు లేనివారే ఎక్కువగా నదీ, సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తుంటారు. ఇక కొన్ని టూరిజం సంస్థలు నదీ, సముద్రయానం ఇష్టపడేవారి కోసం ప్రత్యేకంగా ఓడలు నిర్మించి నడుపుతున్నాయి. సాధారణంగా సముద్ర మార్గాల్లో ఎక్కువగా సరుకు రవాణా జరుగుతుంది. ప్రయాణ ఓడలు కూడా వెళ్తుంటాయి. గతంలో ప్రయాణాలు ఎక్కువగా ఉండేవి. కానీ, విమానయానం అందుబాటులోకి వచ్చాక చాలా మంది దానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటు విమానయానంతో ఉంటుంది. సముద్రయానం నెమ్మదిగా ఉంటుంది. ఖరీదు ఎక్కువే. అయితే రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు జరిగినట్లే.. పడవ ప్రమాదాలు కూడా జరుగుతాయి. అయితే ఓడలు ఎదురెదురుగా ఢీకొనడం చాలా తక్కువ. ఇక్కడ ప్రమాదాలకు కారణం ప్రకృతే. విమాన ప్రయాణాలకు శత్రువు ప్రకృతే. సముద్ర అలలు, అనుకోకుండా వచ్చే మంచు కొండలతోపాటు, సముద్రంలో వచ్చే తుఫాన్ల కారణంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి. ఓడలు, పడవలు నీట మునుగుతాయి. తాజాగా ఇటలీలో ఓ విలాసవంతమైన నౌక తుఫాన్‌లో చిక్కుకుని నీట మునిగింది. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.

    సిసిలీ తీరంలో ఘటన..
    ఇటలీకి చెందిన విలాసవంతమైన నౌక మునక ప్రమాదంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవల సిసిలీ తీరంలో విలాసవంతమైన సూపర్‌యాచ్‌ మునిగిపోవడంతో బ్రిటిష్‌ మిలియనీర్, పారిశ్రామికవేత్త మైక్‌ లించ్‌ గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురు బ్రిటిషర్లు కాగా.. ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్‌ ఉన్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. ఒకరి మృతదేహం అప్పుడే లభ్యమైంది. ఇక ఈ ప్రమాదం నుంచి లించ్‌ భార్యతోపాటు మరో 14 మంది బయటపడ్డారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు. తాజాగా నౌకలో మిలియనీర్, పారిశ్రామికవేత్త మైక్‌ లించ్‌తోపాటు అతని 18 ఏళ్ల కుమార్తె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    సాఫ్ట్‌వేర్‌ సంస్థ అధినేత..
    మైక్‌ లించ్‌(59) 1996లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీని స్థాపించారు. మూడు నెలల కిందటే అమెరికాలో ఓ మోసం కేసులో నిర్దోషిగా బయటపడ్డాడు. సిసిలీలో తీవ్ర తుపాను కారణంగా ఈ విలాసవంతమైన నౌక మునిగిపోయింది. సిసిలియన్‌ పోర్టు నుంచి ఆగస్టు 14న ఈ సూపర్‌యాచ్‌ బయలుదేరింది. ఆదివారం ఇందులో 10 మంది సిబ్బంది 12 మంది ప్యాసింజర్లు ఉన్నారు. పోర్టిసెల్లో తీరానికి చేరుకున్న సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా నౌక మునిగిపోయినట్లు సమాచారం. మైక్‌ లించ్, కుమార్తె మృతదేహం వెలికితీయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువులు, కుటుంబ సభ్యులంతా దు:ఖ సముద్రంలో మునిగిపోయారు. మైక్‌ లించ్‌ను బ్రిటన్‌కు చెందిన బిల్‌గేట్‌గా పిలుస్తారు.

    ప్రమాదం జరిగిందిల..
    ప్రమాదం నుంచి బయటపడిన బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో భారీ అల తాకడంతో నౌక ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి మునిగిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ దళాలు.. వెంటనే రంగంలోకి దిగాయి. ఉపరితలం నుంచి 50 అడుగుల లోతులో నౌక ఉన్నట్టు గుర్తించిన డైవర్లు.. లోపలి ఉన్నవారి కోసం గాలించారు. 15 మంది సురక్షితంగా బయటకు తీశారు. ఓ మహిళ తన ఏడాది కుమార్తెను కోల్పోయింది. బిడ్డ తన చేతుల్లో ఉండగానే సముద్రంలోకి జారిపోయింది. రెండు సెకెన్ల వ్యవధిలోనే నా బిడ్డను పోగొట్టుకున్నానని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.