Gaza Ceasefire: గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీట ముడి పడింది. ఇటు ఇజ్రాయెల్, అటు హమాస్ పట్టు వీడడం లేదు. శాశ్వత కాల్పుల విరమణ కావాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. యుద్ధాన్ని ఆ పేదే లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. మరోవైపు కాల్పుల విరమణపై అమెరికా, ఈజిప్జు, ఖతార్ మధ్యవర్తిత్వంతో ప్రస్తుతం కైరోలో చర్చలు జరుగుతున్నాయి.
40 రోజల విరమణ..
హమాస్ చెరలో 33 మంది బందీల విడుదల ప్రతిగా భారీగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ ప్రతిపాదన చేసింది. అయితే హమాస్ మాత్రం తాత్కాలిక కాల్పుల విరమణకు ససేమిరా అంటోంది. పశ్చిమాసియా పర్యనటలో భాగంగా బుధవారం ఇజ్రాయెల్ వెళ్లిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్.. ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరిపారు.
యుద్ధం కొనసాగింపునకు మొగ్గు..
ఈ సందర్భంగా హమాస్‌పై యుద్ధం ఆపేదే లేదు అంటోంది ఇజ్రాయెల్. శాశ్వత కాల్పుల విరమణకు తమ దేశం అంగీకరించదని నెతన్యాహూ స్పష్టం చేశారు. చర్చల అనంతరం బ్లింకెన్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఉదారంగా చేసిన ప్రతిపాదనకు అంగీకారం తెలపాలని హమాస్‌కు సూచించారు. ప్రతిపాదనపై ఆలస్యంం చేయకుండా ఆమోదించాలని సూచించారు.
శాశ్వతం విరమణకు పట్టు..
అయితే హమాస్ మాత్రం శాశ్వత కాల్పుల విరమణకు పట్టు పడుతోంది. బందీల విడుదల తర్వాత ఇజ్రాయెల్ తమపై విరుచుకుపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో శాశ్వత కాల్పుల విరమణ అయితేనే బందీల విడుదలకు అంగీకరిస్తామని ఇజ్రాయెల్ ప్రతిపాదనకు ఆమోదం తెలుసుతామని అంటోంది. దీంతో 40 రోజుల కాల్పుల విరమణ అంశంపై పీటముడి పడింది.