https://oktelugu.com/

Raheel Accident Case: బోధన్ మాజీ ఎమ్మెల్యే తనయుడి యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం

2022లో ఓ శిశువు మరణానికి రహీల్‌ కారణమయ్యాడు. దీనిని కూడా రహీల్‌ మేనేజ్‌ చేశాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో శిశువు తల్లి కాజల్‌ను మహారాష్ట్ర నుంచి రప్పించి ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలని పోలీసులు నిర్ణయించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 2, 2024 / 10:25 AM IST

    Raheel Accident Case

    Follow us on

    Raheel Accident Case: హైదరాబాద్‌లో 2022, మార్చిలో జరిగిన యాక్సిడెంట్‌తో భారత రాష్ట్ర సమితి మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్‌ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో బాధిత శిశువు తల్లి కాజల్‌ చౌహాన్‌ స్టేట్‌మెంట్‌ నమోదు చేయానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. 2023 డిసెంబర్‌లో రహీల్‌ మద్యం మత్తులో కారు నడిపి బారికేడ్స్‌ను ఢీకొట్టాడు. అయితే ప్రమాదానికి కారణమైన రహీల్‌ను తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యేతో పాటు పోలీసులు ప్రయత్నించారు. రహీల్‌ కారు నడిపినట్లు సీసీ ఫుటేజీలో గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్‌ చేశారు. ఈ క్రమంలో 2022లో చేసిన యాక్సిడెంట్‌ కేసును కూడా పోలీసులు తిరిగి తెరిచారు.

    మహారాష్ట్ర నుంచి బాధితురాలు రాక..
    2022లో ఓ శిశువు మరణానికి రహీల్‌ కారణమయ్యాడు. దీనిని కూడా రహీల్‌ మేనేజ్‌ చేశాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో శిశువు తల్లి కాజల్‌ను మహారాష్ట్ర నుంచి రప్పించి ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు అహ్మద్‌నగర్‌ నుంచి ఆమెను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

    చికిత్సకు రూ.15 లక్షల ఖర్చు..
    రహీల్‌ చేసిన యాక్సిడెంట్‌తో కాజల్‌ కొడుకు చనిపోయాడు. అయితే అంతకుముందు చికిత్స కోసం వారు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. ఈవిషయాన్ని కాజల్, ఆమె భర్త పోలీసులకు తెలిపారు. ప్రమాదంలో చిన్నారి మృతిచెందగా, కాజల్‌ గాయపడిన విషయం తెలిసిందే. వీరిని నిమ్స్‌ సిబ్బంది బెదిరించినట్లు సమాచారం. గాయపడిన కాజల్‌ చికిత్సకు కనీసం రూ.2 లక్షలు అవసరమవుతాయని, మహారాష్ట్రకు చెందిన వారు కావడంతో తెలంగాణ ప్రభుత్వ సాయం పొందేందుకు వారు అర్హులు కాదని ఆసుపత్రి సిబ్బంది దంపతులకు చెప్పారు.

    ఈ కేసులో ముగ్గురు అధికారులపై వేటు..
    ఇక ఈ కేసుకు సబంధించి కూడా బంజారాహిల్స్‌ మాజీ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్‌ మాజీ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, విచారణ అధికారి ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయడంతో కేసు తీవ్ర మలుపు తిరిగింది. ఇదిలా ఉండగా ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశారన్న ఆరోపణతో అరెస్ట్‌ అయినా అఫ్నాన్‌ వాంగ్మూలాన్ని కూడా మరోమారు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. యాక్సిడెంట్‌ సమయంలో రహీల్‌ కారు నడిపినట్లు అఫ్నాన్‌ ఇప్పటికే అంగీకరించాడు.