30 Indians arrested: అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని వెళ్లగొట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం మరోమారు చర్యలు వేగవతం చేసింది. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లే వారికి ఇచ్చే పరిహారం 3 వేల డాలర్లకు పెంచింది. పరిహారం పెంచిన కొన్ని గంటల్లోనే ఇమ్మిగ్రేషన్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కాలిఫోర్నియా చెక్‌పోయింట్ల వద్ద 49 మంది వలసదారులను పట్టుకున్నారు. వీరిలో 30 మంది భారతీయులు ఉన్నారు. కొందరు వాణిజ్య వాహన లైసెన్సులతో భారీ ట్రక్‌లు నడుపుతూ, మరికొందరు అనధికారికంగా నిల్వలు కలిగి ఉన్నారని గుర్తించి అరెస్టు చేశారు. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఈ వివరాలను ప్రకటించింది.
వర్క్ వీసా ఆంక్షలు
ఇటీవల ట్రక్ ప్రమాదాల్లో ప్రాణ నష్టాలు జరిగిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం విదేశీయుల కు కమర్షియల్ డ్రైవింగ్ అనుమతులు, ఉద్యోగ వీసాలు జారీని ఆపేసింది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 వరకు నిర్వహించిన పరిశోధనల్లో 42 మంది అక్రమ డ్రైవర్లను పట్టుకున్నారు. వీరిలో 30 మంది భారతీయులు, మిగిలినవారు చైనా, మెక్సికో, రష్యా, తుర్కియేకు చెందినవారు.
హైవే సెంటినెల్‌లో మరో 7 మంది అరెస్టు
కాలిఫోర్నియా లాజిస్టిక్ కంపెనీలపై దృష్టి సారించిన ’హైవే సెంటినెల్’ ఆపరేషన్‌లో మరో ఏడు మంది చట్టవిరుద్ధ వలసదారులను అరెస్టు చేశారు. దీంతో మొత్తం 49 మందికి చేరింది. రోడ్డు భద్రత, ఇమిగ్రేషన్ నియమాల పాటింపుకు ఈ చర్యలు అందుబాటులోకి తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.
భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఈ జాబితాలో ఉండటం దేశవాసులకు హెచ్చరిక. ట్రంప్ పాలనా విధానాలు వలస దారులపై కఠినత్వం పెంచుతున్నాయి. దీర్ఘకాలంలో ఉద్యోగ అవకాశాలు, వీసా ప్రక్రియలు మరింత కఠినమవుతాయని అంచనా.