Homeఎంటర్టైన్మెంట్Naresh About Indigo Flight: 'ఇండిగో' సిబ్బందితో కొట్లాటకు దిగిన సీనియర్ హీరో నరేష్.. ట్వీట్...

Naresh About Indigo Flight: ‘ఇండిగో’ సిబ్బందితో కొట్లాటకు దిగిన సీనియర్ హీరో నరేష్.. ట్వీట్ వైరల్!

Naresh About Indigo Flight: ఈమధ్య కాలం లో ఇండిగో ఎయిర్ లైన్స్(Indigo Airlines) సంస్థ సేవలను తప్పుబడుతూ వేలాది మంది ప్రయాణికులు నరకం అనుభవిస్తుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం. చెప్పాపెట్టకుండా కొనుగోలు చేసిన టికెట్స్ ని క్యాన్సిల్ చేయడం, ఫ్లైట్స్ ని రద్దు చేయడం వంటివి ఈమధ్య కాలం లో తరచూ జరుగుతూనే ఉన్నాయి. సినీ సెలబ్రిటీల నుండి, సామాన్యుల వరకు ప్రతీ ఒక్కరు అవస్థలకు గురి అవుతున్నారు. ప్రముఖ సీనియర్ నటుడు నరేష్(Naresh Vijay Krishna) నేడు ఇండిగో సంస్థ సేవల గురించి ట్విట్టర్ లో మండిపడుతూ పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘నేను హైదరాబాద్ నుండి మైసూర్ కి వెళ్లేందుకు టికెట్ కొనుగోలు చేసాను. విమానాశ్రయం లో ఫ్లైట్ వద్దకు తీసుకెళ్లే ఇండిగో బస్సు సామ్రాద్యానికి మించి ప్రయాణికులను ఎక్కిస్తోంది. ఇండిగో ఎయిర్ లైన్స్ బస్సులు టార్చర్ చాంబర్స్ గా మారిపోయాయి’ అంటూ ఆయన మండిపడ్డాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘సామ్రాద్యానికి మించిన ప్రయాణికులను బస్సులు కుక్కుతుండడం వల్ల, వృద్ధులు కూడా నిలబడి తీవ్రమైన అవస్థలను ఎదురుకోవాల్సి వస్తుంది. ఇక వీల్ చైర్స్ లో కూర్చున్న వికలాంగుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. బస్సు ఓవర్ లోడ్ అయ్యింది, ఇక ఆపండి అని తానూ గొంతు చించుకొని అరిచినా పట్టించుకునే వాళ్ళు లేరు. ఇలా అయితే కచ్చితంగా ఎదో ఒకరోజు అనర్ధం జరుగుతుంది. బస్సులకు కచ్చితంగా ఒక నిర్దిష్ట పరిమితులు తప్పనిసరిగా పెట్టాలి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి ప్రార్త్యేకమైన స్థలం బస్సులలో కేటాయించాలి. దీనిపై లీగల్ గా తప్పనిసరిగా న్యాయపోరాటం చేస్తాను’ అంటూ నరేష్ హెచ్చరిక జారీ చేసాడు. ఆయన మాట్లాడిన మాటలకు మద్దతు తెలుపుతూ నెటిజెన్స్ కూడా ఈమధ్య కాలం లో ఇండిగో సంస్థ కారణంగా ఎదురుకుంటున్న ఇబ్బందులను కామెంట్స్ రూపం లో తెలియజేసారు.

ఇక నరేష్ సినిమాల విషయానికి వస్తే, టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ డిమాండ్ ఆర్టిస్టులలో ఆయన కూడా ఒకరు అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఏడాదికి కనీసం పది సినిమాల్లో ఆయన నటిస్తూ ఉంటాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన శర్వానంద్ హీరో గా నటించిన ‘నారి నారి నడుమ మురారి ‘ అనే చిత్రం లో కీలక పాత్ర పోషించాడు. ‘సామజవరగమనా’ ఫేమ్ రామ్ అబ్బవరాజు ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కూడా నరేష్ కి ‘సామజవరగమనా’ రేంజ్ పాత్ర దొరికినట్టు తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular