అంతర్జాతీయంPakistan Occupied Kashmir: పీవోకేలో అలజడి.. పోలీసునే చంపేశారు.. ఏం జరుగుతోంది?

Pakistan Occupied Kashmir: పీవోకేలో అలజడి.. పోలీసునే చంపేశారు.. ఏం జరుగుతోంది?

Pakistan Occupied Kashmir: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) ఆందోళనలతో అట్టుడుకుతోంది. అవామీ యాక్షన్‌ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో ఓ పోలీస్‌ ఆందోళనకారులు చక్కిడు. దీంతో అతడిని కొట్టి చంపేశారు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 90 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ యాక్షన్‌ కమిటీకి చెందిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హింసాత్మక ఘటనలతో ఆ ప్రాంతంలో వ్యాపారాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులను అదుపు చేయడానికి భద్రతా దళాలు ఒక దశలో కాల్పులు జరిపాయి.

ఆందోళనలు ఎందుకంటే..
స్థానిక మంగ్లా డ్యామ్‌ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తమకు ఉచితంగా ఇవ్వాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. గోధుమలపై రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరింది. ధరలు భారీగా పెరిగాయి. దీంతో స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం 144 సెక్షన్‌ విధించింది.

ప్రజలపై కాల్పులు..
ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారని పీవోకేలో ఉద్యమకారుడు అంజాద్‌ అయూబ్‌ మీర్జా తెలిపాడు. కాల్పుల్లో ఇద్దరు చనిపోయాయని వెల్లడించాడు. పొరుగ దేశం(భారత్‌) జోక్యం చేసుకోవాలని కోరాడు. ఇక్కడ పరిస్థితులు దిగజారిప్యోయని పేర్కొన్నాడు. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం కల్పించాలని ప్రాధేయపడ్డాడు.

మంగ్లా డ్యామ్‌లో పాక్‌ దోపిడీ..
జీలం నదిపై మంగ్లా ఆనకట్టను 1967లో నిర్మించారు. మీర్పుర్‌ జిల్లాలోని అత్యంత సారవవతమైన భూములను తీసుకుని ఈ ఆనకట్ట నిర్మిచంఆరు. ఇక్కడ భారీ ౖహె డ్రోపవర్‌ ప్లాంటు ఉంది. 1975 నాటికే డ్యామ్‌ నిర్మాణ ఖర్చులు వచ్చేశాయి. 2010లో ఇక్కడ 250 బిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. దీని ఆదాయం మొత్తం పాకిస్థాన్‌ ప్రభుత్వం తీసుకుంటోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని స్థానిక ప్రభుత్వానికి రూపాయి కూడా ఇవ్వడం లేదు. డ్యామ్‌లో మొత్తం 1400 మెగా వాట్ల విద్యుత్‌ తయారవుతుంది. వీటిలో 300 మెగావాట్లను స్థానికంగా ఇస్తామని నాడు పాక్‌ ప్రభుత్వం పీవోకే ప్రభుత్వానికి మాట ఇచ్చింది. కానీ మాట తప్పి ఇక్కడి విద్యుత్‌ను పంజాబ్‌ రాష్ట్రానికి తరలిస్తోంది. మరోవైపు పంజాబ్‌ ప్రజలకన్నా స్థానికులు విద్యుత్‌కు అధిక ధర చెల్లిస్తున్నారు. ఇదే అసంతృప్తికి కారణమైంది.

అక్రమంగా చెట్లు నరికివేత..
మరోవైపు పాకిస్థాన్‌ పీవోకేలోని చెట్లను కూడా అక్రమంగా నరికివేస్తోందని పరిశోధకుడు డాక్టర్‌ షబ్బీర్‌చౌద్రీ తెలిపారు. దీంతో మట్టిపెళ్లలు విరిగిపడుతున్నాయని, వరదలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఏటా 300 కోట్ల పాకిస్థానీ రూపాయలకు సరిపడా పువ్వులు, వన మూలికలు పండిస్తారు. వీటిని పాక్‌ కార్పొరేషన్లు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నాయి. స్థానిక ప్రభుత్వానికి ఇచ్చే నిధులపై ఎలాంటి రికార్డులు లేవు. ఇక నీలం లోయలో అమూల్యమైన రత్నాలు దొరుకుతాయి. పాకిస్థాన్‌ దాదాపు 40 బిలియన్‌ డాలర్లకుపైగా విక్రయించింది. అయినా కనీస సదుపాయాలు కల్పించడం లేదు. పాక్‌ ప్రభుత్వం ఆగడాలు పెరగడంతో తిరుగుబాటు మొదలైంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

POK Protests: పీవోకే స్వతంత్ర దేశం కాదు.. ఆక్రమిత ప్రాంతమే..!

POK Protests: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న ప్రజా ఉద్యమ రోజు రోజుకూ ఉధృతమవుతోంది. నిరసనలు అణచివేయడానికి పాక్‌ ఆర్మీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిచడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు...

Pakistan : పాక్ సైన్యాధక్షుడు ఆసిమ్ మునీర్ మరో డయ్యర్

Pakistan : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. అక్కడి ప్రజలు తమ ప్రాథమిక హక్కులు, జీవన అవసరాల కోసం వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే,...

Most Popular

Indus Water Dispute: సింధూ జలాలు కావలట… పాపం ఇజ్జత్ పోగొట్టుకున్న పాకిస్తాన్

Indus Water Dispute: ఎన్ని రకాలుగా అంతర్జాతీయ వేదికల మీద పరువు పోగొట్టుకున్నప్పటికీ పాకిస్తాన్ తీరు మారదు. సిగ్గు లేదా జీడి గింజ అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహారం...

Maho Beach: విమానం టేకాఫ్.. భయంకరమైన గాలులు.. పర్యాటకులు ఎగిరిపడ్డారు.. వైరల్ వీడియో

Maho Beach: వాతావరణం ఆహ్లాదంగా ఉంది.. మబ్బులు కమ్ముకున్నాయి. సముద్రపు అలలు తీరాన్ని తాకుతున్నాయి. పర్యాటకులు ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సముద్రపు ఒడ్డున సేద తీరుతున్నారు. నచ్చిన ఫుడ్ తింటు ఎంజాయ్ చేస్తున్నారు....

Kotha Jaipal Reddy : దుబాయ్‌లో ‘ఈటీసీఏ’ బోనాల జాతర.. ముఖ్య అతిథిగా మైత్రి గ్రూప్ అధినేత కొత్త...

దుబాయ్: తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో యూఏఈలో అత్యంత వైభవంగా నిర్వహించారు....

Trump Family : ట్రంప్‌ ఫ్యామిలీపై ట్రెహాన్ వేదికగా సంచలన పరిణామం

Trump Family : రాయలసీమ ఫ్యాక్సనిజంలో రక్తానికి రక్తం అన్నట్లుగా ఒకప్పుడు హత్యలు జరిగేవి. కుటుంబాలనే మట్టుబెట్టేవారు. అయితే క్రమంగా హింస పరిష్కారం కాదని మారుతున్న తరాలకు అర్థమైంది. కఠిన శిక్షలే కూడా...

De-dollarization : అమెరికా డాలర్‌ నుంచి మరో దేశం ఔట్‌.. చైనాతో చేతులు కలిపిన లిబియా!

De-dollarization : ప్రపంచంలో ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తున్న కరెన్సీ డాలర్‌. బలమైన డాలర్‌ స్థిరత్వమే ప్రపంచ వ్యాప్తంగా డాలర్‌ ఆధిపత్యానికి కారణం. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు, చైనా ఆర్థికాభివృద్ధి తదితర కారణాలతో...
Exit mobile version