https://oktelugu.com/

Crime News: భాయ్ ఫ్రెండ్ ను సంతృప్తి పరిచేందుకు ఈ అమ్మాయి ఏం చేసిందంటే.. పోలీసులకు మతి పోయినంత పనైంది

ఆ రెండు ఫోన్లను స్వాధీనం చేసుకొని, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. హై ప్రొఫైల్ కేస్ కావడంతో మీడియాకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 12, 2024 / 03:17 PM IST

    Boy friend girl friend

    Follow us on

    Crime News: తప్పు ఒప్పులతో నిమిత్తం లేకుండా.. ఒక మనిషిని యధాతధంగా అంగీకరించేదే ప్రేమంటే. కానీ, ఈ కాలంలో ప్రేమలు అలాలేవు. నచ్చితే లవ్యూ చెప్పేయడం.. ఆ తర్వాత కలిసి ఉండడం.. విభేదాలు వస్తే విడిపోవడం.. సినిమాల్లో అయితే ఎలా చూస్తున్నామో.. అచ్చం నిజ జీవితంలో అలానే జరుగుతోంది. చాలా మంది దీనినే ప్రేమ అనుకుని భ్రమలో బతికేస్తున్నారు. జీవితం అంటే ఒక బంధంలో ఇమిడి పోకూడదని.. స్వేచ్ఛా పిపాసి లాగా జీవించాలని చెప్పేస్తున్నారు. ఇలాంటి పెడ పోకడలు పెరుగుతున్న సమాజంలో ఓ యువతి చేసిన పని పెద్ద చర్చకు దారితీస్తోంది. అంతేకాదు పోలీసుల బుర్రలు బద్దలు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

    పూణే ప్రాంతంలో నిహారిక(పేరు మార్చాం)(20) ఒక కళాశాలలో చదువుతోంది. ఆమెది తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దుల్లో ఓ మారుమూలు గ్రామం. అక్కడి నుంచి ఉన్నత చదువు కోసం పూణే వచ్చింది. అక్కడ ఆమెకు రాజ్ కుమార్( పేరు మార్చాం) పరిచయమయ్యాడు.. అనంతరం అది ప్రేమగా మారింది.. వారిద్దరూ సాన్నిహిత్యంగా ఉండడం మొదలుపెట్టారు. నిహారిక కాలేజీ హాస్టల్ లో ఉండేది. పెద్ద హాల్లో వేరువేరు క్యాబిన్లలో పది మంది ఉండేవారు.. అయితే నిహారిక, రాజ్ కుమార్ సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో వారిద్దరి మధ్య ఒక విచిత్రమైన సంభాషణ జరిగింది. “మీ హాస్టల్లో ఎంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు? వారు నీకంటే అందంగా ఉంటారా” అనే రాజ్ కుమార్ అడిగితే..” నీకు వారి అంతర్గత అందాలు కూడా పంపిస్తా.. అప్పుడు నేను అందంగా ఉంటానో? వారు అందంగా ఉంటారో? నువ్వే తేల్చి చెప్పాలంటూ” అతడికి సమాధానం చెప్పింది.

    ఆ తర్వాత నిహారిక చదువును పక్కనపెట్టి తన స్నేహితులు లో దుస్తులు మార్చుకున్నప్పుడు, బాత్ రూం లో ఉన్నప్పుడు వీడియోలు, ఫోటోలు తీయడం మొదలుపెట్టి.. ఇలా 400 మంది దాకా తన స్నేహితుల ప్రైవేట్ ఫొటోస్ తీసింది. వీడియోలు చిత్రీకరించింది. వాటిని రాజకుమార్ కు పంపించింది. అంతేకాదు నిహారిక, రాజ్ కుమార్ తాము సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలను చిత్రీకరించుకొని పరస్పరం పంపించుకున్నారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో కలకలం మేలుకుంది. అయితే నిహారిక ఓ పేరుపొందిన ప్రైవేటు యూనివర్సిటీలో చదువుతున్న నేపథ్యంలో.. ఈ కేసును అత్యంత జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. రాజ్ కుమార్, నిహారిక ఫోన్లు స్వాధీనం చేసుకుని.. అందులో ఉన్న ఫోటోలు, వీడియోలు పరిశీలించగా పోలీసులకు మతి పోయినంత పనైంది. ఆ రెండు ఫోన్లను స్వాధీనం చేసుకొని, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. హై ప్రొఫైల్ కేస్ కావడంతో మీడియాకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు.