Homeవింతలు-విశేషాలుPig Kidney Transplant: మనిషికి పంది కిడ్నీ.. ఆపరేషన్‌ సక్సెస్‌.. కానీ అంతలోనే విషాదం!

Pig Kidney Transplant: మనిషికి పంది కిడ్నీ.. ఆపరేషన్‌ సక్సెస్‌.. కానీ అంతలోనే విషాదం!

Pig Kidney Transplant: అమెరికా మసాచుసెట్స్‌ జనరల్‌ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగికి పంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు వైద్యులు. ఆపరేషన్‌ విజయవంతమైనా రోగి మాత్రం ప్రాణాలు కోల్పయాడు.

ఏం జరిగిందంటే..
ఇంగ్లాండ్‌ వేమౌత్‌ నగరానికి చెందిన రిచర్డ్‌ స్లేమాన్‌(62) కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. 2018లో వైద్యులు అతనికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు. కొంతకాలం బాగున్నా.. తర్వాత సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. డయాలసిస్‌ చేశారు. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.

పంది కిడ్నీ అమర్చిన డాక్టర్లు..
ఈ ఏఆది మార్చి 16న అమెరికా వైద్యులు రిచర్డ్‌ స్లేమాన్‌కు మసాచుట్స్‌ జనరల్‌ ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు సర్జరీ చేశారు. పంది కిడ్నీని ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు. ఆపరేషన్‌ సక్సెస్‌ కావడం.. కొన్ని రోజుల చికిత్స తర్వాత రిచర్డ స్లేమాన్‌ కోలుకున్నాడు. దీంతో అతడిని డిశ్చార్జ్‌ చేశారు. ఈ తరుణంలో ఏప్రిల్‌ 11న స్లేమాన్‌ మరణించినట్లు కుటుంబ సభ్యులు, మసాచుసెట్స్‌ వైద్యులు తెలిపారు. పంది కిడ్నీ అమర్చడం వల్లనే స్లేమాన్‌ మరణించినట్లు కొందరు భావిస్తున్నా.. అందుకు ఆధారాలు లేవని వైద్యులు అంటున్నారు. అతని కుటుంబ సభ్యులు మాత్రం స్లేమాన్‌ తమతో గడిపేందుకు వైద్యులు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

గతంలోనూ పంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌..
గతంలో బ్రెయిన్‌ డెడ్‌ అయి కృత్రిమ లైఫ్‌ సపోర్టుపై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు న్యూయార్క్‌ యూనివర్సిటీ లాన్‌గోన్‌ హెల్త్‌ మెడికల్‌ సెంటర్‌ వైద్యులు. రెండు నెలల వ్యవధిలోనే బాధితుడు మరణించాడు. తాజాగా స్లేమాన్‌ పంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తే తాను రెండేళ్లు బతుకుతానని ఆపరేషన్‌కు ముందు తెలిపాడు. దీంతో మసాచుసెట్స్‌ వైద్యులు ఈ ఆపరేషన్‌చేశారు. కానీ, అతను కూడా 27 రోజులకే మరణించాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version