https://oktelugu.com/

Hezbollah : చనిపోయి ఐదు నెలలు.. అంత్యక్రియలకు 14 లక్షల మంది జనం.. ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి..

ఒకటి కాదు రెండు కాదు.. 14 లక్షల మంది.. ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. తమ నాయకులు చనిపోయారని నినాదాలు చేశారు. వారి ఆశయ సాధన కోసం తమ ప్రాణాలు కూడా ఇస్తామని నినాదాలు చేశారు. వారు చిందించిన రక్తం ఎప్పటికీ పచ్చిగానే ఉంటుందని.. తమ భవిష్యత్తు కార్యసాధన గుర్తు చేస్తుందని వారు పేర్కొన్నారు.

Written By: , Updated On : February 25, 2025 / 12:00 AM IST
Follow us on

Hezbollah : గత ఏడాది ఇజ్రాయిల్ (Israel) ఇరాన్ పై వైమానిక దాడి జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో హిజ్ బొల్లా(Hijbolla) మాజీ చీఫ్ నస్రల్లా, సయ్యద్ హషేమ్ సఫీద్దీన్ కన్నుమూశారు.. అయితే తమ సంప్రదాయాల ప్రకారం ఇరాన్ వీరిద్దరి భౌతిక కాయాలను ఖననం చేయకుండా ఐదు నెలల పాటు భద్రంగా దాచింది. ఐదు నెలల కాలం పూర్తయిన తర్వాత వారిద్దరి భౌతిక కాయాలను ఖననం చేసింది. అయితే వీరి అంతిమయాత్రను ఇరాన్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సుమారు 14 లక్షల మంది దాకా ఈ అంతిమయాత్రకు హాజరయ్యారు. ఖననం చేసే ప్రాంతం వరకు కాలినడకనే వచ్చారు. ఇలా వచ్చిన వారిలో అన్ని వర్గాల ప్రజలున్నారు. అంతిమయాత్రలో యువకులు ముందు వరుసలో నడిచారు. నస్రల్లా, సయ్యద్ హషేమ్ సఫీద్దీన్ సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. వారి ఆశయ సాధనకు నడుం బిగిస్తామని నినాదాలు చేశారు.

అప్రమత్తమైన ఇజ్రాయిల్

నస్రల్లా, సయ్యద్ హషేమ్ సఫీద్దీన్ అంతిమయాత్ర నేపథ్యంలో ఇజ్రాయిల్ అప్రమత్తమయింది. ఎందుకంటే పశ్చిమాసియాలో ఈ రెండు దేశాల మధ్య నిత్యం రావణ కాష్టం రగులుతూనే ఉంటుంది. పాలస్తి నాకు అనుకూలంగా ఇరాన్ ఎప్పటినుంచో పని చేస్తోంది. ఇరాన్ ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే హిజ్ బొల్లా కు పాలిస్తీనా గతంలో స్థావరం కల్పించింది. అయితే గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో ఇజ్రాయిల్ పాలస్తీనా పై దాడులు చేసింది. ఈ క్రమంలో పాలస్తీనా కు అండగా ఇరాన్ రంగంలోకి దిగింది.. ఇరాన్ పై కూడా ఇజ్రాయిల్ వైమానిక దాడులకు దిగడంతో.. హిజ్ బొల్లా కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇజ్రాయిల్ హిజ్ బొల్లా టార్గెట్ గా సీక్రెట్ ఆపరేషన్లు చేసింది.. తమ దేశం పైకి దాడి చేయకుండా ఉండేందుకు గూడచారుల ద్వారా దాడులు చేయించింది. ఫలితంగా వారంతా హతమయ్యారు. చివరికి ఇరాన్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండే నస్రల్లా, సయ్యద్ హషేమ్ సఫీద్దీన్ ను కూడా ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసి అంతమొందిచింది. సీక్రెట్ ఆపరేషన్లు చేయడంలో ఇజ్రాయిల్ ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుంటుంది. తన దేశ అంతర్గత భద్రత విషయంలో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలకు వెనకాడదు. ఇప్పుడు ఇరాన్ అనుబంధంగా పనిచే హిజ్ బొల్లా పై ఏకంగా ఇజ్రాయిల్ యుద్ధమే ప్రకటించింది. ఆ సంస్థ నామరూపాలను లేకుండా చేసేందుకు వైమానిక దాడులు చేసింది. నస్రల్లా, సయ్యద్ హషేమ్ సఫీద్దీన్ అంతిమయాత్ర నేపథ్యంలో ఇజ్రాయిల్ భద్రతను కట్టు దిట్టం చేసింది.