https://oktelugu.com/

Diabetics : డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగితే ఏమవుతుంది.. పరిశోధనల్లో తేలింది ఇదే !

Diabetics : ప్రస్తుతం డయబెటిస్ చాపకింద నీరుల విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీంతో చాలా మంది షుగర్ కంట్రోల్లో ఉంచుకునేందుకు ప్రతి రోజు మందులు వేసుకోవడమే కాకుండా ఆహార నిమయమాలను కూడా పాటిస్తుంటారు.

Written By: , Updated On : February 25, 2025 / 01:00 AM IST
Diabetics

Diabetics

Follow us on

Diabetics : ప్రస్తుతం డయబెటిస్ చాపకింద నీరుల విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీంతో చాలా మంది షుగర్ కంట్రోల్లో ఉంచుకునేందుకు ప్రతి రోజు మందులు వేసుకోవడమే కాకుండా ఆహార నిమయమాలను కూడా పాటిస్తుంటారు. కానీ, కొందరు మాత్రం ఓ పక్క మందులు వేసుకుంటూనే మరో పక్క వారి ఇష్టం వచ్చినట్లు నచ్చినవి తినడం.. తాగడం చేస్తుంటారు. అందులో భాగంగానే మద్యం కూడా సేవిస్తుంటారు. అయితే అసలు డయాబెటిస్ ఉన్న వాళ్లు ఆల్కాహాల్ సేవించవచ్చా.. ఒక వేళ తాగితే ఏమవుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

డయాబెటిస్ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఆల్కాహాల్ సేవించకూడదని ప్రముఖ వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్ కు మద్యం తోడైతే అది అగ్నికి ఆజ్యం పోసినట్లేనని హెచ్చరిస్తున్నారు. కొందరు ఆల్కాహాల్ తక్కువ పరిమాణంలో తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటదని అనుకుంటారని.. అది కేవలం అపోహ మాత్రమేనని సూచిస్తున్నారు. మమూలుగా డయాబెటిస్ ఉన్న వారిలో నాడులు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. అదే మద్యం తాగితే ఈ సమస్య మరింత తీవ్రతరమవుతుంది. ఎంత ఎక్కువకాలం నుంచి మధుమేహంతో బాధపడుతుంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బతినే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ కారణంగానే చాలా మందిలో కాళ్లు,చేతుల్లో తిమ్మిర్లు, మంట అనిపించడం, సూదులు పొడిచినట్లు అనుభూతి చెందడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి ఆల్కహాల్ తోడైతే సమస్య మరింత జఠిలం అవుతుంది. ఇంకాస్త త్వరగా నాడులు దెబ్బతినే అవకాశం ఉంది.

అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు మద్యం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు డాక్టర్లు. 2018లో ప్రచురితమైన ‘డయాబెటిస్ కేర్ జర్నల్‌’లో ఓ అధ్యయనం ప్రకారం మధుమేహం ఉన్న వారు ఆల్కాహాల్ సేవించడం వల్ల షుగర్ లెవల్స్ 30శాతం పెరిగినట్లు పరిశోధకులు కనుగొన్నారు. అందువల్ల షుగర్ పేషెంట్స్ వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. మద్యం మానేసి రెగ్యులర్ గా వ్యాయామం, మంచి నిద్ర, రెగ్యులర్ గా మందులు, మంచి ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.