Virata Parvam Real Story: అది 1990 నక్సలిజం బ్యాక్ డ్రాప్. అక్కడ చిగురించిన ఓ రియల్ ప్రేమ కథనే ‘విరాటపర్వం’ మూవీగా మలిచాడు దర్శకుడు ‘వేణు ఉడుగుల’. రానా హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ విరాటపర్వం మూవీ విడుదలకు సిద్ధమైంది. తూము సరళ అనే మహిళా నక్సలైట్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఆమె లైఫ్ లో జరిగిన సంఘటనలకు కమర్షియల్ హంగులను జోడిస్తూ దర్శకుడు వేణు తెరకెక్కించారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ కు ప్రేమకథను జోడిస్తూ రూపొందిన ఈ చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలోనే అసలు విరాటపర్వం కథ ఏంటి? తూము సరళ చుట్టూ జరిగిన సంఘటనలు ఏంటన్నది ఎవరికీ తెలియని నిజాలు.. తెలంగాణ సమాజంలో మావోయిస్టు ఉద్యమంలో ఉన్న వారు అప్పుడు జరిగిన విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే విరాటపర్వం కథ బయటకు వచ్చింది.
– విరాటపర్వం కథ ఇదే..
1990వ దశకంలో విప్లవ భావాలపట్ల ఆకర్షితురాలై నక్సల్ ఉద్యమంలో చేరేందుకు వెళ్లిన ‘తూము సరళ’ కథే విరాటపర్వం స్టోరీ. సరళ ప్రజల కోసం పోరాడేందుకు నక్సల్ బాట పట్టిందనేది ఒక వాదన. అయితే దాంతోపాటు విప్లవ భావాల కన్నా శంకరన్న అనే మావోయిస్టు నాయకుడి పట్ల ఉన్న ఇష్టంతోనే దళంలోకి వెళ్లిందుకు ప్రయత్నించిందనేది మరోవాదన..
Also Read: Anushka Shetty: హీరోయిన్ అనుష్క శెట్టి సోదరుడి పై హత్యాయత్నం..భద్రత కల్పించిన పోలీసులు
తూము సరళ పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఆమెది కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యంలో. కమ్యూనిస్టు భావాలతోనే ఆమె నిజామాబాద్ వెళ్లి శంకరన్న దళంలోకి చేరిందని చెబుతారు. అప్పట్లో నిజామాబాద్ లోని గ్రామీణ ప్రాంతాల్లో తిరిగిన సరళ ఉద్యమానికి ఊపిరి పోశారు. అక్కడి స్థానిక కమిటీలను దళంలోకి చేర్చేందుకు సాయం పడ్డారు.
అయితే మావోయిస్టు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పోలీసులు కోవర్ట్ ఆపరేషన్లు చేశారని.. సరళపై కూడా శంకరన్న దళం అనుమానంగా ఉండేదనే ప్రచారం ఉంది.సరళ కూడా పొంతనలేని సమాధానాలు చెప్పడం కూడా ఆమెపై అనుమానాలకు కారణమైందని అంటున్నారు. సరళను ఇన్ఫార్మర్ అనే కారణంతో మావోయిస్టులే చంపారన్న ప్రచారం ఉంది. ఆమెపై అత్యాచారం చేసి చంపారనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇదంతా పోలీసులే మావోయిస్టులను విలన్లుగా చూపించడానికి సరళను చంపి నాటకమాడారని విప్లవకారులు చెబుతారు. సినిమాలో అసలు ఏం క్లైమాక్స్ చూపించారన్నది ట్విస్ట్..
Recommended Videos
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Virata parvam is based on true incidents inspired by the life of a woman from warangal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com