Canada : కెనడాలో భారత సంతతి ప్రజలు ఎక్కువ. ప్రధానంగా పంజాబీలు 6 శాతం ఉన్నారు. రెండేళ్ల క్రితం వరకు భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించిన కెనడా.. ఖలిస్థానీ వేర్పాటు వాది నిజ్జర్ హత్య తర్వాత భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది. భారత వ్యతిరేక దేశాలతో చేకి కలిపి దోషిగా చూపే ప్రయత్నం చేస్తోంది. ఇందులో కీలక పాత్ర పోషించారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. 2019లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రూడో.. క్రమంగా ప్రజల విశ్వాసం కోల్పోయారు. సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలు వైదొలిగాయి. ఈ క్రమంలో ట్రూడో నాలుగు రోజుల క్రితం ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. దీంతో నూతన ప్రధాని ఎవరన్న చర్చ జరుగుఓతంది. ఈ తరణంలో తాను ఉన్నానంటూ ముందుకు వచ్చాడు భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య. భవిఫ్యత్ అవసరాల కోసం క ఎనడాను పునర్నిర్మించడానికి, శ్రుయస్సును కాపాడేందుక మరింత సమర్థవంతమైన ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కెనడా తదుపరి ప్రధానిగా పోటీ చేస్తున్నానని ట్వీట్ చేశారు. చాలా మంది కెనడియన్లు, ముఖ్యంగా యువత ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెరుగుతున్న ఖర్చులు, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు, ఇతరత్రా కారణాలతో పేదలు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.
తన విధానాలు వివరిస్తూ..
చంద్ర ఆర్యా కెనడా ప్రధాని రేసులో తన విధానాలను వివరిస్తూ. డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ వంటి అంశాల ఆధారంగా కాకుండా మెరిట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా మారడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను కూడా ప్రస్తావించారు. గతంలో దేశం నైపుణ్యం కలిగిన కార్మికులను అనుమతించిందని తెలిపారు. నేడు చాలా మంది తాత్కాలిక నివాసితులు ఉన్నారని పేర్కొన్నారు. చంద్ర ఆర్య కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని సిరా తాలూకా ద్వార్లు గ్రామానికి చెందినవారు. 2006లో కెనడాకు వలస వెల్లారు. పలుమార్లు పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించారు.
అక్టోబర్‌లో ఎన్నికలు..
ఇదిలా ఉంటే ఈ ఏడాది అక్టోబర్‌లో కెనడా పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రజాదరణలో ప్రస్తుతం అధికార లిబర్ పార్టీకన్నా.. కన్జర్వేటివ్ పార్టీ మెరుగా ఉంది. ఇక ఇదే సమయంలో ట్రూడో రాజీనామా చేయడంతో పార్టీకి దిశానిర్దేశం చేసే నేత కరువయ్యారు. మరోవైపు జనవరి 27న ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాసం ప్రవేశపెట్టాలని మూడు 6పతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. దీనిని తప్పించుకునేందుకు ట్రూడో పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేశారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Another indian origin leader in the race for canadas prime minister announced himself
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com