ABN RK: తిరుమల తిరుపతి దేవస్థానం.. దేవదేవుడి వ్యవహారాలను చూస్తుంది. స్వామివారికి పూజల నుంచి మొదలుపెడితే భక్తుల చేసుకునే దర్శనం వరకు అన్నింటిని పర్యవేక్షిస్తుంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో రాజకీయ పార్టీల జోక్యం పెరిగిపోవడంతో అది అంతకంతకు భ్రష్టు పట్టిపోతోంది. స్వామి వారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి నుంచి మొదలు పెడితే శ్రీ వాణి ట్రస్ట్ వరకు ఇటీవల అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి. వీటన్నిటికంటే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఆరుగురి మరణానికి కారణమైంది. ఇది జాతీయ స్థాయిలో వివాదం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే తిరుమల వెళ్లిపోయారు. గాయపడిన వారిని పరామర్శించారు. శుక్రవారం గాయపడిన వారికి వైకుంఠ ద్వారంలో స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అయితే అంతకుముందు చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్, ఈవో వాదలాడుకున్నారు. చంద్రబాబు ఎదుట నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషణలకు దిగారు.
మన సిస్టంలో
మన సిస్టం గురించి గొప్పగా చెప్పుకుంటాం కానీ.. హలో అనేక అవ లక్షణాలు ఉంటాయి.. ఒక ఐఏఎస్ అధికారి సాధారణంగా పొలిటికల్ సెలబ్రిటీల జోలికి పోరు. కానీ టీటీడీ కొత్త చైర్మన్ ను కూడా ఈవో ఎహెపో అన్నాడు అంటే మామూలు విషయం కాదు. ఈ లెక్కన బిఆర్ నాయుడుకి పదవి ఔన్నత్యం కాపాడుకునే తెలివి లేదని తెలుస్తోంది. హుందాతనం , ఆ తెలివిడి లేదని ఇట్టే అర్థమవుతుంది.. చివరికి సైలెంట్ గా చేసుకునే పనులు కూడా సానుకూలంగా మలుచుకునే సమర్థత కూడా లేదని అవగతం అవుతూనే ఉంది. చూస్తుంటే ఓ న్యూస్ ఛానల్ డిబేట్ ప్రెజెంటర్ల భావత స్థాయిలాగా కనిపిస్తోంది.. ఒక ప్రెస్టీజియస్ పోస్టును కాపాడుకోలేని స్థితిలో బిఆర్ నాయుడు ఉండడం అత్యంత విషాదం. మరి ఈ ఘటనను చంద్రబాబు ఎలా టాకిల్ చేస్తాడో తెలియదు కాని.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అసలు విషయం చెప్పేసాడు. ఈవో శ్యామలరావు, ఏఈఓ లే అసలు దోషులని తేల్చేశాడు. ఇక జగన్ అయితే చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. తన సొంత పత్రికలో కథనాలను ప్రచురించడం.. చానల్లో స్టోరీస్ టెలికాస్ట్ చేయించడం.. ఇక సోషల్ మీడియా గ్రూపులో అయితే రచ్చ రంబోలా చేయించడంలో విజయవంతం అవుతున్నాడు. ఒకవేళ ఇది స్థానంలో కనుక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉంటే.. అనుమానం ఎందుకు.. కథ వేరే విధంగా ఉండేది. రాధాకృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్టును కోరుకున్నది నిజం. కాకపోతే బిఆర్ నాయుడు దక్కించుకున్నది అంతకంటే కఠినమైన నిజం. టీటీడీ చైర్మన్ పోస్టు దక్కలేదు కాబట్టే రాధాకృష్ణ ఎగిరి పడుతున్నాడు. కొత్త పలుకులో చంద్రబాబును తూర్పార పడబడుతున్నాడు.