Virat Kohli
Virat Kohli: సౌతాఫ్రికా జట్టుతో టెస్టు ట్రై సిరీస్‌ను కోల్పోయిన భారత్ నేడు మరోసారి తలపడుతోంది. జనవరి 19న ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. బోలాండ్ పార్క్‌లోని పార్ల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో కేఎల్ రాహుల్ మరోసారి జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధమయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్సీగా తప్పుకుని దాదాపు ఐదేళ్ల తర్వాత సాధారణ బ్యాటర్‌గా మైదానంలో అడుగుపెట్టనున్నాడు. మొన్నటివరకు కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన రాహుల్ ఇప్పుడు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించగా.. విరాట్ అతని కెప్టెన్సీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు.
Virat Kohli
కెప్టెన్ రోహిత శర్మ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం అవ్వగా అతని స్థానంలో శిఖర్ ధావన్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఓపెనింగ్ జోడీగా తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ సెంచరీ సాధించాడు. శిఖర్ మొన్నటివరకు జట్టుకు దూరంగా ఉన్నా ఇప్పుడు ఎంట్రీ ఇవ్వడంతో అతని భాగస్వామ్యం జట్టు విజయానికి ఎంతో దోహదపడనుంది. ఇక మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ బలంగా ఉన్నాడు. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్లు వరుసగా ఉన్నారు. ఈ మ్యాచులో కోహ్లీ భారీ పరుగులు సాధిస్తాడని, ఇప్పుడు అతనిపై ఎలాంటి ఒత్తిడి ఉందని అభిమానులు నమ్ముతున్నారు.
Virat Kohli
Also Read: విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?
సూర్యకుమార్ యాదవ్ మంచి ప్లేయర్. అవకాశాలు వస్తున్నా పెద్దగా ఇన్నింగ్స్ క్రియేట్ చేయలేకపోతున్నాడు. హార్దిక్ లేని లోటును అయ్యర్ భర్తీ చేస్తాడా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక ఐపీఎల్ ఫేజ్-2లో వెలుగులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ తొలిసారిగా వన్డేలో అరంగేంట్రం చేయనున్నాడు. ఇతను ఆల్ రౌండ్ ప్రదర్శన చేసే అవకాశం ఉంది. శార్దూల్ ఠాకూర్‌కు తొలి మ్యాచ్‌లో అవకాశం దక్కడం కష్టమని తెలుస్తోంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే అశ్విన్ స్థానంలో జట్టులోకి చాహల్ వచ్చాడు.
Shikhar Dhawan and Rohit Sharma
దక్షిణాఫ్రికాలో చాహల్ రికార్డు అద్భుతంగా ఉంది. గతంలో 7 మ్యాచ్‌లు ఆడి 15.65 సగటుతో 20 వికెట్లు తీశాడు. 22 పరుగులకే 5 వికెట్లు తీయడం చాహల్ కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనగా చెప్పుకోవచ్చు. ఫాస్ట్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలతో పేస్ కూడా బలంగానే ఉంది. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత ఆటగాళ్లు కసిగా ఉండగా.. మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.
Also Read: విరాట్ కెప్టెన్సీ శకం ముగిసింది.. నెక్ట్స్ ఏంటి..?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Virat kohli back to being just a batsman in india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com