West Bengal Viral Dance Video: సోషల్ మీడియాలో ఆ వీడియో సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఒక రకంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ వీడియోలో ఉంది సెలబ్రెటీలు కాదు.. పేరు మోసిన యాక్టర్లు అంతకన్నా కాదు. ఓ సాధారణ మహిళ. అందులోనూ గృహిణి.. పెద్దగా ఊపు తెప్పించే పాట రావడం లేదు.. చెవులు బద్దలయ్యే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేదు.. బిజీగా ఉన్న ఒక రోడ్డు.. అందులోనూ ఒక సివిక్ వాలంటీర్, పక్కనే ఒక పోలీస్.. వారి వెనకాల పోలీస్ వాహనం.. దాని ముందు ఈమె డ్యాన్స్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Also Read: ఆటోను నుజ్జునుజ్జు చేసిన రెండు బస్సులు.. కానీ ఊహించని ట్విస్ట్.. షాకింగ్ వీడియో
మనదేశంలో అవినీతి బాగా జరిగే రాష్ట్రాలలో.. వసూళ్లు బీభత్సంగా చోటు చేసుకునే రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ ఒకటి. పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం మమత ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడ ఆమె చాలా సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పని చేస్తోంది. గడిచిన సారీ సివిక్ వాలంటీర్లు అనే వ్యవస్థను తీసుకొచ్చింది. అప్పట్లో ఓ సివిక్ వాలంటీర్ ఓ డాక్టర్ ను అత్యాచారం చేసి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ కేసు పై విచారణ జరుగుతూనే ఉంది. ఇలాంటి వివాదాల్లోనే కాదు.. వసూళ్ల విషయంలో సివిక్ వాలంటీర్లు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఎవరినీ వదిలిపెట్టకుండా దర్జాగా దందాలు సాగిస్తున్నారు. సివిక్ వాలంటీర్ల దోపిడీ తట్టుకోలేక అక్కడి ప్రజలు అనేక సందర్భాలలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ వాలంటీర్లు తమ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. సివిక్ వాలంటీర్ల దోపిడీని నిరసిస్తూ ఓ మహిళ చేపట్టిన ఆందోళన వెస్ట్ బెంగాల్ లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Also Read: కొత్త ట్రెండ్: రైలు బాత్రూంలే ఓయో రూం లు.. జంటల కొత్త కాన్సెప్ట్
వెస్ట్ బెంగాల్లో ఇటీవల బిజీగా ఉన్న ఒక రోడ్డులో పోలీసు, సివిక్ వాలంటీర్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కొంతమంది వాహనదారుల నుంచి వారు డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు.. అన్ని పత్రాలు ఉన్నప్పటికీ.. డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఓ మహిళ వారి తీరు నిరసిస్తూ డాన్స్ చేయడం మొదలు పెట్టింది. అలా ఏకధాటిగా ఆమె స్టెప్పులు వేయడంతో సివిక్ వాలంటీర్, పోలీస్ అధికారి వెనకడుగు వేశారు. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. దీంతో అక్కడ వాహనదారులు ఆ మహిళను అభినందించారు..” వీరి దందాను భరించడం సాధ్యం కావడం లేదు. కానీ ఒక మహిళ ధైర్యం చేసి ఎదిరించింది. ఒక్క మాట కూడా తిట్టకుండా.. దూషణ పర్వం సాగించకుండా.. తన నిరసనను వ్యక్తం చేసింది. దెబ్బకు సివిక్ వాలంటీర్, పోలీస్ అధికారి అక్కడినుంచి వెళ్లిపోయారని” సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.
This video is amazing-
WB Police Constable and Civic Volunteer were there to take bribe from Trucks.
This chhapri girl spoiled their plan
— Facts (@BefittingFacts) August 22, 2025