Auto Crushed Between Buses: కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న రెండు ప్రైవేట్ బస్సుల మధ్య చిక్కుకున్న ఆటో నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ హృదయవిదారక ఘటన చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
Also Read: రిసార్ట్ స్టాఫ్ తో యంగ్ హీరోయిన్ రౌడీయిజం..సంచలనం రేపుతున్న వీడియో!
పోలీసుల కథనం ప్రకారం.. ముందుగా ఓ బస్సు వెళ్తుండగా దాని వెనుకే ఆటో వెళుతూ ఉంది. ఆ సమయంలో వెనక నుంచి మరొక బస్సు అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆటో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.
అంతపెద్దగా జరిగిన ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోకపోవడం గమనార్హం. ఆటో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అక్కడి స్థానికులు అప్రమత్తమై వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గాయపడినవారిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు సమాచారం.
ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదుపుతప్పిన డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: ఛీ ఏం టేస్ట్ రా బై.. పురుగుల మందు ఈఎంఐలో దొరుకుతుందా బ్రో
ఇలాంటి ఘటనలు మరల జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్ నియమాలు పాటించడం, వాహనదారుల జాగ్రత్త అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
An Auto was crushed b/w 2 buses,
This incident took place in Chitradurg Karnataka(04/08/25), pic.twitter.com/yhznP56Usn— MALLU PARUTI (@mallu_paruti) August 5, 2025