Homeవైరల్ వీడియోస్Viral Video : లైకుల పిచ్చితో ఫెవిక్విక్‌తో ఆడుకుంటే ఏమవుతుందో చూడండి!

Viral Video : లైకుల పిచ్చితో ఫెవిక్విక్‌తో ఆడుకుంటే ఏమవుతుందో చూడండి!

Viral Video : ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్నిసార్లు వారు చేసే పనులు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. మరికొందరు వీడియోలు చేసే ఉత్సాహంలో తమను తాము ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఒక వీడియో ఒకటి ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది. ఒక యువకుడు వీడియో చేయడానికి ప్రయత్నించి చిక్కుల్లో పడ్డాడు. లేని ఆపదను కొని తెచ్చుకున్నాడు. అతని పరిస్థితి చూస్తే జాలి వేయక మానదు.

ఫెవిక్విక్ అనేది విరిగిన వస్తువులను అతికించుకునేందుకు ఉపయోగించే పవర్ ఫుల్ గ్లూ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అది ఒకసారి అతుక్కుంటే మళ్లీ విడదీయడం చాలా కష్టం. అందుకే దానితో ఎప్పుడూ ఆటలు ఆడకూడదని చెబుతారు. కానీ కొందరు లైక్‌లు, వ్యూస్‌ పిచ్చితో దానితో కూడా ఆడుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో చూడండి. ఒక యువకుడు దానితో తన పెదవులను అతికించుకున్నాడు.

Also Read : క్రియేటివిటీ అంటే ఇదేనా.. రొట్టెలను ఫెవికాల్ పెట్టి అతికిస్తారా ?

వీడియోలో చూసినట్లు అయితే.. ఒక కుర్రాడు తన పెదవులకు ఫెవిక్విక్ పూసుకున్నాడు. క్షణాల్లో అతని పెదవులు ఒకదానికొకటి అతుక్కుపోయాయి. దాంతో అతడి నోరు పూర్తిగా మూసుకపోయింది. మొదట్లో సరదాగా మొదలైన పని.. చివరకు తన నోరు మూసుకుపోయేందుకు దారి తీసింది. ఎంత ప్రయత్నించినా అతని పెదవులు విడిపోలేదు. పెదవులు అతుక్కుపోయాయని నోరు తెరవడం సాధ్యం కాదని గ్రహించిన వెంటనే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఏడ్వడం మొదలు పెట్టాడు.

ఈ వీడియోను ఎక్స్‌లో @ArunPrayagi1 అనే అకౌంట్ దర్వా షేర్ చేశాడు. ఈ వార్త రాసే సమయానికి వేలాది మంది ఈ వీడియోను చూశారు. తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేశారు. ఒక యూజర్ “లైక్‌లు, వ్యూస్‌ల కోసం ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు?” అని ప్రశ్నించగా, మరొకరు “ఇలాంటి పిచ్చి పనులు వీడియోల్లో ఎందుకు చేస్తారు?” అని కామెంట్ చేశారు. ఇంకా చాలా మంది ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందించారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular