Viral Video : నేటి యూత్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి చిత్రవిచిత్రమైన పనులు చేస్తున్నారు. కొన్నిసార్లు వారు చేసే పనులు చూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఒక యువతి రొట్టెలు చేస్తూ చేసిన పని చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఆ యువతి ఏం చేసింది? ఎందుకు అంతలా వైరల్ అవుతోంది? పూర్తి వివరాలు తెలుసకుందాం.
Also Read : పిచ్చికి పరాకాష్ఠ.. రీల్స్ కోసం చెట్టెక్కి డ్యాన్స్ చేసిన యువతి !
రొట్టెలు గుండ్రంగా చేయడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. దాని కోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే అందరూ మెచ్చుకునేలాంటి రొట్టెలు తయారవుతాయి. అయితే కొందరు మాత్రం తమ బుర్రకు పదును పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైలర్ అవుతున్న వీడియో అలాంటిదే. ఇందులో ఓ యువతి రొట్టెలు గుండ్రంగా చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో ఒక రొట్టె మధ్యలో చిరిగిపోయింది. దానిని అతికించడానికి ఆమె చేసిన పని చూస్తే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది.
వీడియోలో ఆ యువతి కిచెన్‌లో రొట్టెలు కాల్చుకుంటూ ఉంటుంది. గుండ్రంగా రావాలని ప్రయత్నిస్తుండగా ఓ రొట్టె మధ్యలో చిరిగిపోతుంది. దానిని అతికించడానికి ఆ యువతి ఫెవికాల్ ను ఉపయోగిస్తుంది. అది అతుక్కుని గుండ్రటి రొట్టెలా ఉడికిపోతుందని ఆమె భావించింది. అయితే ఒక రొట్టెను అతికించడానికి ఫెవికాలు కూడా ఉపయోగిస్తారని ఎవరూ ఊహించరు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @studentgyaan అనే అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి లక్షలాది మంది వీడియోను చూసి తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెడుతున్నారు. ఒక యూజర్ “అక్క దయచేసి మీరు కిచెన్‌లోకి రావద్దు, లేకపోతే మీ ఇంట్లో ఎవరూ మిగలదు” అని కామెంట్ చేయగా, మరొకరు “ఇదేం రొట్టెలు చేసే పద్ధతి?” అని ప్రశ్నించారు. ఇంకొకరు “అక్క పిండికి, కాగితానికి చాలా తేడా ఉంటుంది, రొట్టెలు చేసే ముందు మీరు ఇది తెలుసుకోవాలి” అని రాశారు.
View this post on Instagram